నిజామాబాద్ లో బీజేపీ పార్టీలోనే అంతర్గత పోరు తారాస్థాయికి చేరుకుంది. ధర్మపురి అరవింద్ కి ఎంపీ టికెట్ ఇవ్వడం పై ఆ పార్టీ కార్యకర్తలు చాలా తీవ్ర స్థాయిలో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇవాళ(శుక్రవారం) బీజేపీ పార్టీ కార్యకర్త సతీష్ అరవింద్ కి టికెట్ ఇవ్వొద్దు అంటూ రోడ్డు పైన నిరసన వ్యక్తం చేశాడు. అంతేకాదు పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.
ధర్మపురి అరవింద్ పై మొదటి నుండి బీజేపీ పార్టీ కార్యకర్తల్లో తీవ్రమైన వ్యతిరేకత ఉంది. పార్టీ కి సంబంధించిన ఏ కార్యక్రమంలో కూడా చురుగ్గా పాల్గొనడని, అసలు కార్యకర్తలతో కలుపుగోలుతనం అతనికి ఉండదని, ఎల్లప్పుడూ సొంత నిర్ణయాలే తీసుకుంటాడని ఆపోపిస్తున్నారు. కార్యకర్తలకు ఏదైనా ఇబ్బంది జరిగినా, పోరాటాలు చేసి అరెస్ట్ అయినా కూడా పట్టించుకోడని, ఇలాంటి వ్యక్తిని పార్టీలో ఉంచడమే ఎక్కువ, అలాంటిది ఎంపీ టికెట్ అసలు ఇవ్వవద్దంటూ బీజేపీ కార్యకర్తలు హై కమాండ్ ని డిమాండ్ చేస్తూ నిరసన వ్యక్తం చేస్తున్నారు.
ఇది కూడా చదవండి:‘వర్క్ ఫ్రమ్ హోం’ మెసేజ్ లింక్ పై క్లిక్ చేసారో ఇక అంతే
The post ధర్మపురి అరవింద్‌కు టికెట్ ఇస్తే చనిపోతామంటున్న బీజేపీ కార్యకర్తలు appeared first on tnewstelugu.com.
