రాష్ట్రంలో గ్రూప్-1 పరీక్ష నిర్వహణపై సీఎం రేవంత్ రెడ్డి కీలకమైన ప్రకటన చేశారు. త్వరలోనే గ్రూప్-1 పరీక్ష నిర్వహిస్తామని అసెంబ్లీలో ప్రకటించారు. గ్రూప్-1 అభ్యర్థుల వయోపరిమితిని 46 ఏళ్లకు పెంచుతామన్నారు. కొన్ని నిబంధనల కారణంగా టీఎస్‌పీఎస్‌సీ ప్రక్షాళన ఆలస్యమైందన్నారు. అంతేకాదు.. త్వరలోనే పోలీసు శాఖలో 15 వేల ఉద్యోగాలను భర్తీ చేస్తామనిన్నారు. యూనివర్సిటీలలోని ఖాళీలను కూడా త్వరలోనే భర్తీ చేస్తామని చెప్పారు.
ఇది కూడా చదవండి: సీఎం వ్యంగ్యం తగ్గించుకోవాలి, వ్యవహారం నేర్చుకోవాలి
