మహారాష్ట్రలో ఘోరరోడ్డు ప్రమాదం జరిగింది. నాందేడ్ జిల్లాలో భోకర్ ఉమారి రహదారిపై వేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి వంతెనపై నుంచి కాల్వలో పడింది. ఈ ఘటనలో అక్కడిక్కడే ఐదుగురు మరణించారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలు చేపట్టారు.
డ్రైవర్ నిర్లక్ష్యంతోనే ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. మ్రుతదేహాలను స్వాధీనం చేసుకుని..క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారిలో ఇద్దరి పరిస్ధితి విషమంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
మ్రుతులను సవితా శ్యామ్ భాలేరావు(25), ప్రీతి పరమేశ్వర్ భాలేరావు(8), సుశీల్ మరోటి గైక్వాడ్(9), రేఖాబాయి పరమేశ్వర్ భాలేరావు(30), అంజనాబాయి జ్ఞానేశ్వర్ భాలేరావు (28)గా గుర్తించారు.వీరంతా నాందేడ్ లోని భోకర్ తాలుకాలోని రేనాపూర్ గ్రామానికి చెందినవారుగా గుర్తించారు.
భాలేరావు కుటుంబం నిజామాబాద్ జిల్లాలోని నవీపేటలో నివసిస్తుంది. బంధువుల ఇంట్లో పుట్టినరోజు వేడుకలకోసం భోకర్ కు వచ్చారు. పుట్టినరోజు ముగిసిన తర్వాత గురువారం రాత్రి నవీపేట కు వెళ్తుండగా ఈ కారు ప్రమాదానికి గురైంది.
ఇది కూడా చదవండి: గ్రూప్ 4 ఫలితాలు విడుదల..!!
The post మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం..ఐదుగురు దుర్మరణం..!! appeared first on tnewstelugu.com.
