ఎల్ఎల్బీ, ఎల్‌ఎల్‌ఎం వంటి కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే టీఎస్ లాసెట్, పీజీలాసెట్ నోటిఫికేషన్ షెడ్యూల్ విడుదలైంది. దీనికి సంబందించి ఈ నెల 28న నోటిఫికేషన్‌ను విడుదల చేయనున్నట్లు లాసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ బీ విజయలక్ష్మీ తెలిపారు.
మార్చి 1 నుంచి దరఖాస్తులను ఆన్‌లైన్‌లో స్వీకరించనున్నారు. దరఖాస్తుల సమర్పణకు చివరి తేదీ ఏప్రిల్ 15. లేట్ ఫీజుతో మే 25 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. జూన్ 3వ తేదీన కంప్యూటర్ బేస్డ్ రాత పరీక్ష నిర్వహించనున్నారు. మూడేండ్ల ఎల్ఎల్‌బీ కోర్సుకు ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, ఐదేండ్ల ఎల్ఎల్‌బీ, ఎల్ఎల్ఎం కోర్సులకు మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 4 గంటల వరకు రాత పరీక్ష నిర్వహించనున్నారు.
ఇది కూడా చదవండి:గ్రూప్-1 అభ్యర్థులకు గుడ్ న్యూస్
