Close Menu
  • Telugu today
  • తాజా వార్తలు
  • వార్తలు
Facebook X (Twitter) Instagram
Trending
  • Gamble Caribbean Hold’em Casino poker on the internet pokie
  • Better No deposit Local casino Bonuses 2024 » 100 percent free Bucks & Free Spins
  • The Increase of Student-Driven Encyclopedias: Changing Understanding Landscapes
  • Finest Cellular Casinos: Greatest Us Cellular Gambling enterprise Applications and Advertisements within the 2025
  • Best Mobile Web based poker Software the real deal Cash on apple’s ios & Android os within the 2025
  • Greatest ten Online gambling Programs for real Cash in 2025
  • Casino utan svensk licens 2025 – Topp 10 casino utan Spelpaus
  • Bet with Sahabet 💰 Bonus up to 10000 Rupees 💰 Play Online Casino Games
Telangana Press
  • Telugu today
  • తాజా వార్తలు
  • వార్తలు
Telangana Press
వార్తలు

ఫిరాయింపు నేతలు ప్రజాతీర్పు కోరాల్సిందే-Namasthe Telangana

TelanganapressBy TelanganapressFebruary 9, 2024No Comments

పార్టీ ఫిరాయింపుదార్లకు అడ్డుకట్ట వేస్తూ కేరళ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఓ పార్టీ నుంచి ఎన్నికై మరో పార్టీలోకి ఫిరాయించేవారు మళ్లీ ప్రజాతీర్పును కోరాల్సిందేనని స్పష్టం చేసింది. ప్రజలెన్నుకున్న ప్రజాప్రతినిధులు ఓటర్ల అభీష్టానికి వ్యతిరేకంగా వ్యవహరించకూడదని పేర్కొంది.

February 10, 2024 / 04:35 AM IST
ఫిరాయింపు నేతలు ప్రజాతీర్పు కోరాల్సిందే
  • ఓటర్ల అభీష్టానికి విరుద్ధంగా వ్యవహరించరాదు
  • తన పార్టీకి వ్యతిరేకంగా వైఖరిని మార్చుకోరాదు
  • సంచలన తీర్పు వెలువరించిన కేరళ హైకోర్టు

కొచ్చి, ఫిబ్రవరి 9: పార్టీ ఫిరాయింపుదార్లకు అడ్డుకట్ట వేస్తూ కేరళ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఓ పార్టీ నుంచి ఎన్నికై మరో పార్టీలోకి ఫిరాయించేవారు మళ్లీ ప్రజాతీర్పును కోరాల్సిందేనని స్పష్టం చేసింది. ప్రజలెన్నుకున్న ప్రజాప్రతినిధులు ఓటర్ల అభీష్టానికి వ్యతిరేకంగా వ్యవహరించకూడదని పేర్కొంది. ఓ రాజకీయ పార్టీ లేదా రాజకీయ కూటమి నుండి ఎన్నికైన అభ్యర్థి ఆ పార్టీ లేదా కూటమికి వ్యతిరేకంగా తన వైఖరిని మార్చుకోకూడదని స్పష్టం చేసింది. తన పార్టీకి విరుద్ధంగా వ్యవహరించాలనుకుంటే ఆ అభ్యర్థి మరోసారి ప్రజాతీర్పును కోరాల్సిందేనని తేల్చి చెప్పింది. ఇడుక్కి జిల్లాలోని ఆదిమాలి గ్రామ పంచాయతీకి చెందిన పార్టీ ఫిరాయింపు కేసులో జస్టిస్‌ పీవీ కున్హికృష్ణన్‌ ఈ నెల 5న ఈ తీర్పును వెలువరించారు.

ఓ ప్రజాప్రతినిధి తన నియోజకవర్గ ప్రజల గొంతుకగా ఉండాలని న్యాయమూర్తి పేర్కొన్నారు. ఆ ప్రజాప్రతినిధి ఓటర్ల అభీష్టానికి వ్యతిరేకంగా, తన ఇష్టానుసారంగా వ్యవహరించకూడదని అన్నారు. ‘ఓ రాజకీయ పార్టీ లేదా కూటమి నుంచి ఎన్నికైన ప్రతినిధి తన పదవీకాలం పూర్తయ్యేవరకు ఆ పార్టీని లేదా కూటమిని విడిచిపెట్టకూడదు. ఓ రాజకీయ పార్టీ అభ్యర్థిగా ఉన్నందునే వారిని ప్రజలు ఎన్నుకున్నారు కాబట్టి.. ఆ అభ్యర్థి తన ఇష్టానుసారంగా వ్యవహరించకూడదు’ అని వ్యాఖ్యానించారు. ఏ రాజకీయ పార్టీ మద్దతు లేకుండా స్వతంత్రంగా ఎన్నికైతే.. ఆ అభ్యర్థి ప్రజల అభీష్టం ప్రకారం నడుచుకోవాలని పేర్కొన్నారు. ఓ పార్టీ అభ్యర్థిగా ఎన్నికైన వారు ఆయా మండళ్లు లేదా సంస్థలు, సభల్లో తమను ఎన్నుకున్న ప్రజల ఉద్దేశాలను వెల్లడించాలని సూచించారు.

ఈ సందర్భంగా ఆంగ్ల క్యాథలిక్‌ చరిత్రకారుడు, రాజకీయవేత్త, రచయిత లార్డ్‌ యాక్టన్‌ చెప్పిన మాటలను ప్రస్తావిస్తూ.. ‘అధికారం అవినీతికి పాల్పడేలా చేస్తుంది.. సంపూర్ణ అధికారం అవినీతిలో పూర్తిగా ముంచేస్తుంది’ అన్నారు. ప్రజాస్వామ్యంలో ఎన్నికైన ప్రజాప్రతినిధులు ఈ మాటలను గుర్తుంచుకోవాలని చెప్పారు. ఎన్నికైన సభ్యుడు మరోసారి ఓటర్ల తీర్పు కోరేంత వరకు తనను ఎన్నుకున్న ప్రజల అభీష్టాన్ని వ్యక్తపరచాలన్నది ఫిరాయింపుల నిరోధక చట్టం ఉద్దేశమని గుర్తు చేశారు.

Source link

Telanganapress
  • Website

Related Posts

రైతు ఆదాయం రెట్టింపునకు ప్రత్యేక ప్రణాళిక-Namasthe Telangana

April 16, 2024

‘లోక్‌సభ’కు బీఆర్‌ఎస్‌ సన్నద్ధం-Namasthe Telangana

April 16, 2024

Health Insurance- IRDAI | హెల్త్ ఇన్సూరెన్సీ ‘కవరేజీ’పై ఐఆర్డీఏఐ గుడ్ న్యూస్.. అదేమిటంటే..?!-Namasthe Telangana

April 16, 2024
Leave A Reply Cancel Reply

Categories
  • 1
  • AI News
  • News
  • Telugu today
  • Uncategorized
  • తాజా వార్తలు
  • వార్తలు
కాపీరైట్ © 2024 Telanganapress.com సర్వ హక్కులు ప్రత్యేకించబడినవి.
  • Privacy Policy
  • Disclaimer
  • Terms & Conditions
  • About us
  • Contact us

Type above and press Enter to search. Press Esc to cancel.