కాంగ్రెస్ ఇచ్చిన హామీలను ప్రజలకు చేరేవింధంగా మనం ప్రభుత్వం పై ఒత్తిడి తీసుకురావాలన్నారు దాస్యం వినయ భాస్కర్. దళిత బంధు కుడా ఇచ్చేలాగా కృషి చేయాలన్నారు. హనుమకొండలోని బాలసముద్రం లోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో వరంగల్ పశ్చిమ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశాన్ని దాస్యం వినయ్ భాస్కర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసారు, ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ పాల్గొన్నారు. సమావేశంలో మాట్లాడిన వినయ భాస్కర్.. ఇప్పుడున్న ప్రభుత్వం పేదల గురించే అలోచించచే ప్రభుత్వం కాదు. చిరు వ్యాపారులను ఇబ్బంది పెడుతోంది. ఈ ప్రభుత్వం, ఇక నుంచి గుడిసె వాసుల జోలికి వెళ్లిన, చిరు వ్యాపారుల జోలికి వస్తే ఖబర్దార్ బిడ్డ ఉరికునేది లేదన్నారు.
తప్పుడు కేసులు పెట్టి మా కార్యకర్తలను వేధించడం జరుగుతోందన్నారు దాస్యం వినయ భాస్కర్. కార్యకర్తల జోలికి వస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. మనకు రాబోయే రోజుల్లో మనకు మంచి రోజులు వస్తాయ్ ఎవరు అదైర్యపడొద్దన్నారు. ఇప్పుడు ఉన్న ప్రభుత్వం ప్రజా వ్యతిరేక కార్యక్రమాలకు పాలుపడుతోందని.. త్వరలనే ప్రజలు ఈ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పుతారన్నారు.
ఒక పోరాటాన్ని సొంతం చేసుకున్న కండువా.. గులాబీ కండువా అని అన్నారు ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్. జై తెలంగాణ నినాదంతో మాశ్వాస అని ప్రకటించిన పార్టీ తెలంగాణ పార్టీ అన్నారు. కాంగ్రెస్ పార్టీ వాగ్ధానాలను భంగం కలిగించే పార్టీ అని విమర్శించారు. అసెంబ్లీ ముందు ఉన్న కంచె కన్నా ఎక్కువ కంచెను ఏర్పాటు చేసారు. ఎన్ని సార్లు పడిన మళ్ళీ లేచి నిలబడే పార్టీ.. ఉద్యమం నుండి పుట్టిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ అని తెలిపారు. భారతీయ ప్రజల పోరాట ఫలితమే భారత దేశం, అలాగే తెలంగాణ ప్రజల పోరాట ఫలితమే తెలంగాణ. సోనియ గాంధీ దయతో ఇచ్చింది కాదన్నారు దేశపతి. మార్పు రావాలి కాంగ్రెస్ రావాలి అన్నారు.. ఇప్పుడు నెంబర్ ప్లేట్స్ మారుస్తున్నారు.. ప్రజలకు ఇది ఒక అదనపు ఖర్చు అని తెలిపారు.
మహిళలకు ఉచిత బస్ ప్రయాణం అన్నారు మంచిదే కానీ… దానివల్ల ఆటో నడుపుకునే వాళ్ళ జీవితాలు రోడ్డు మీద పడ్డాయ్. వారి బాగుకోసం ఏమైనా చర్యలు తీసుకున్నారా ఇంతవరకు అని ప్రశ్నించారు ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్.
ఇది కూడా చదవండి:ఓటుకు నోటు కేసులో సీఎ రేవంత్ కు సుప్రీం నోటీస్ జారీ
