బీఆర్ఎస్ సర్కార్ రాష్ట్రాన్ని అప్పుల కుప్ప చేసిందని అసత్య ప్రచారాలు చేస్తున్న కాంగ్రెస్ సర్కార్…ఇప్పుడు తాను చేస్తున్నదేమిటని సామాన్య ప్రజలు ప్రశ్నిస్తున్నారు. అధికారంలోకి వచ్చి రెండు నెలలోపే అప్పులు చేసేందుకు రెడీ అయ్యింది. తాజాగా శుక్రవారం మరో వెయ్యికోట్లు అప్పు చేయడంతో గత రెండు నెలల్లో రేవంత్ ప్రభుత్వం చేసిన అప్పు రూ. 6,400కోట్ల చేరింది.
దేశవ్యాప్తంగా మొత్తం 9 రాష్ట్రాలు బాండ్ల విక్రయం ద్వారా ఆర్బీఐ నుంచి రూ. 17,500కోట్లు అప్పులు తీసుకున్నాయి. అందులో తెలంగాణ 22 ఏండ్ల కాల పరిమితితో రూ. 1,000కోట్ల అప్పు తీసుకుంది. తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత డిసెంబర్ నెలలో 12వ తేదీన రూ. 500కోట్లు, 19వ తేదీన రూ. 900కోట్ల అప్పు తీసుకువచ్చింది. అదేవిధంగా జనవరి 9వ తేదీన రూ. 1000కోట్లు, 16వ తేదీన రూ .2 వేల కోట్లు, 30వతేదీన రూ.1,000కోట్లు అప్పుగా తీసుకుంది. ఇవే కాకుండా మరో మూడు నెలల్లో రూ. 9వేలకోట్ల రుణం తీసుకోనున్నట్లు సమాచారం. తెలంగాణ తీసుకోనున్న రుణాల వివరాలను ఆర్బీఐ ఈ మధ్యే విడుదల చేసింది.
ఇది కూడా చదవండి: 71వ మిస్ వరల్డ్ పోటీలకు భారత్ ఆతిథ్యం..!!
