ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే TS ICET ప్రవేశ పరీక్షకు సంబంధించిన షెడ్యూల్ ఇవాళ(శనివారం) విడుదలైంది. మార్చి 5వ తేదీన టీఎస్ ఐసెట్-2024 నోటిఫికేషన్ను విడుదల చేయనున్నట్లు ఐసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ తాటికొండ రమేశ్ తెలిపారు. మార్చి 7వ తేదీ నుంచి దరఖాస్తులను ఆన్లైన్ ద్వారా స్వీకరించనున్నారు. ఎలాంటి లేట్ ఫీజు లేకుండా ఏప్రిల్ 30వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆలస్య రుసుం రూ. 250తో మే 17 వరకు, రూ. 500తో మే 27వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవచ్చు. జూన్ 4, 5 తేదీల్లో కంప్యూటర్ బేస్డ్ విధానంలో రాతపరీక్ష నిర్వహించనున్నారు.
ఇది కూడా చదవండి:కాంగ్రెస్ హైదరాబాద్ నగర అభివృద్ధిని అడ్డుకుంటోంది
