Close Menu
  • Telugu today
  • తాజా వార్తలు
  • వార్తలు
Facebook X (Twitter) Instagram
Trending
  • Gamble Caribbean Hold’em Casino poker on the internet pokie
  • Better No deposit Local casino Bonuses 2024 » 100 percent free Bucks & Free Spins
  • The Increase of Student-Driven Encyclopedias: Changing Understanding Landscapes
  • Finest Cellular Casinos: Greatest Us Cellular Gambling enterprise Applications and Advertisements within the 2025
  • Best Mobile Web based poker Software the real deal Cash on apple’s ios & Android os within the 2025
  • Greatest ten Online gambling Programs for real Cash in 2025
  • Casino utan svensk licens 2025 – Topp 10 casino utan Spelpaus
  • Bet with Sahabet 💰 Bonus up to 10000 Rupees 💰 Play Online Casino Games
Telangana Press
  • Telugu today
  • తాజా వార్తలు
  • వార్తలు
Telangana Press
తాజా వార్తలు

దేశవ్యాప్తంగా త్వరలో జీపీఎస్ ఆధారిత టోల్ ఫీజు వసూళ్లు

TelanganapressBy TelanganapressFebruary 11, 2024No Comments

దేశంలో రోడ్ల విస్తరణ తర్వాత టోల్ ప్లాజా వ్యవస్థలు ఏర్పాటు చేశారు. అయితే త్వరలోనే ఈ స్థానంలో జీపీఎస్ ఆధారిత టోల్ వసూలు వ్యవస్థలు ఏర్పాటు చేయనున్నారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఈ జీపీఎస్ ఆధారిత ఎలక్ట్రానిక్ టోల్ వసూలు వ్యవస్థలో ఆటోమేటిగ్గా నెంబర్ ప్లేట్ ను గుర్తించే టెక్నాలజీ ఉంటుంది. హైవేలపై నిర్దేశిత ప్రాంతాల్లో అమర్చిన కెమెరాలు ఓ వాహనం రోడ్డెక్కినప్పటి నుంచి అది హైవేపై ఎంత దూరం ప్రయాణిస్తుందో గుర్తిస్తాయి.

నూతనంగా తీసుకువస్తున్న ఈ జీపీఎస్ టోల్ సిస్టమ్ ప్రకారం… ఓ వాహనం ప్రయాణించిన దూరం ఆధారంగానే టోల్ చెల్లించాల్సి ఉంటుంది. ఆ వాహనం ఎన్ని టోల్ ప్లాజాలు దాటి వచ్చిందో ఈ జీపీఎస్ వ్యవస్థ నమోదు చేస్తుంది. దాని ఆధారంగానే టోల్ ఫీజును లెక్కిస్తారు. ఇప్పటివరకు ఆయా టోల్ ప్లాజాల దగ్గర ఫిక్స్ డ్ చార్జీలను చెల్లించాల్సి వచ్చేది. ఈ వ్యవస్థలో వాహన డ్రైవర్ బ్యాంక్ అకౌంట్ ను లింక్ చేయాల్సి ఉంటుంది. తద్వారా ఆటోమేటిగ్గా టోల్ ఫీజు అతడి అకౌంట్ నుంచి మినహాయించుకుంటారు. ఈ కొత్త విధానం ద్వారా టోల్ ప్లాజాల దగ్గర ఆగాల్సిన అవసరం ఉండదు. తద్వారా ఎలాంటి అవాంతరాలు లేకుండా ప్రయాణం సాధ్యమవుతుంది.

ఈ జీపీఎస్ ఆధారిత టోల్ వ్యవస్థను తొలుత పైలెట్ ప్రాజెక్టుగా ఫాస్టాగ్ లకు అదనంగా అమలు చేయనున్నట్టు కేంద్రం తెలిపింది. ఈ ఏడాది ఏప్రిల్ నాటికి జీపీఎస్ వ్యవస్థను తీసుకువస్తామంది.

ఇది కూడా చదవండి: సౌర‌భ్ గంగూలీ ఇంట్లో చోరీ

Source link

Telanganapress
  • Website

Related Posts

ఎన్నికల తర్వాత బీజేపీలోకి సీఎం రేవంత్..గులాబీ బాస్ సంచలన వ్యాఖ్యలు..!

April 16, 2024

మామిడి పండు తినే అరగంట ముందు ఈ పనిచేయండి..!

April 16, 2024

గీత దాటితే వేటే..ప్రభుత్వ సలహాదారులకు ఈసీ వార్నింగ్..!

April 16, 2024
Leave A Reply Cancel Reply

Categories
  • 1
  • AI News
  • News
  • Telugu today
  • Uncategorized
  • తాజా వార్తలు
  • వార్తలు
కాపీరైట్ © 2024 Telanganapress.com సర్వ హక్కులు ప్రత్యేకించబడినవి.
  • Privacy Policy
  • Disclaimer
  • Terms & Conditions
  • About us
  • Contact us

Type above and press Enter to search. Press Esc to cancel.