తెలుగు సినీ దర్శకుల సంఘం ఎన్నికల్లో వీర శంకర్ ప్యానల్ విజయం సాధించింది. సంఘం ప్రెసిడెంట్‌గా వీర శంకర్, వైస్ ప్రెసిడెంట్లుగా వశిష్ట,సాయి రాజేశ్ ఎన్నికయ్యారు. ఇవాళ(ఆదివారం) ఉదయం 8 గంటల నుంచి 4 గంటల వరకు ఎన్నికలు జరిగాయి. ఆ తర్వాత ఫలితాలు విడుదలయ్యాయి.
దర్శకుల సంఘంలో దాదాపు 1500 మంది యాక్టివ్‌గా ఉన్నారు. తాజా ఎన్నికల్లో 1113 ఓట్లు పోలయ్యాయి. వీర శంకర్‌కు 536 ఓట్లు రాగా, ప్రత్యర్థి సముద్రకు 304 ఓట్లు పడ్డాయి. నూతన కార్యవర్గం రెండేళ్లు కొనసాగనుంది.. వీర శంకర్ గతంలోనూ అధ్యక్షుడిగా పనిచేశారు.
గుడుంబా శంకర్, ప్రేమ కోసం,హలో: ఐ లవ్ యూ,విజయరామరాజు సినిమాలకు దర్శకత్వం వహించారు వీర శంకర్. అంతేకాదు విరాట పర్వం, జాతి రత్నాలు సినిమాల్లో కూడా యాక్టింగ్ చేశాడు. వశిష్ట బింబిసార తో మొదట ప్రయత్నంలోనే సక్సెస్ సాధించాడు. ప్రస్తుతం చిరంజీవితో విశ్వంభర మూవీ తీస్తున్నాడు. ఇక సాయి రాజేశ్ ‘బేబీ’ మూవీ తో ఘన విజయం అందుకున్నారు.
ఇది కూడా చదవండి:ఖానాపూర్ యువతి అలేఖ్య హత్య కేసులో మరో ఇద్దరు అరెస్ట్
