రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఖానాపూర్ యువతి అలేఖ్య హత్యకేసులో పోలీసులు మరో ఇద్దరిని అరెస్ట్ చేశారు. నిందితుడు శ్రీకాంత్ తల్లి సత్తెవ్వ, తమ్ముడు శివకృష్ణను అదుపులోకి తీసుకొని రిమాండ్‌కు తరలించారు. కాగా, తనకు దక్కనిది మరొకరికి దక్కకూడదన్న ఉద్దేశంతో. కత్తితో పొడిచి దారుణంగా హతమార్చాడు. ఈ ఘటన నిర్మల్ జిల్లా ఖానాపూర్ గురువారం జరిగింది. ఖానాపూర్‌లోని అంబేద్కర్‌నగర్ కాలనీకి చెందిన జూకింది శ్రీకాంత్. షేట్పెల్లి అలేఖ్య( 22) స్థానిక ప్రభుత్వ కాలేజీలో డిగ్రీ పూర్తి చేసింది.
శ్రీకాంత్ కానిస్టేబుల్ ఉద్యోగానికి ప్రిపేర్ కాగా క్వాలిఫై కాలేదు. అలేఖ్య టైలరింగ్ కోచింగ్ తీసుకుంటోంది. శ్రీకాంత్ ఐదేండ్లుగా ప్రేమ పేరుతో ఆమెను వేధిస్తున్నాడు. యువతి విషయాన్ని పెద్దలకు చెప్పడంతో పెద్ద మనుషుల సమక్షంలో అతడిని మందలించారు. అలేఖ్యకు ఇటీవలే నిశ్చితార్థం అయింది. విషయం తెలుసుకున్న శ్రీకాంత్. వరుడికి సమాచారం ఇచ్చి ఆ పెండ్లిని చెడగొట్టాడు. తనకు దక్కని అలేఖ్య మరెవరికీ దక్క కూడదని, అందుకు యువతిని కడతేర్చాలని పక్కా ప్లాన్ వేసుకున్నాడు.
గురువారం మధ్యాహ్నం 2 నుంచి 3 గంటల మధ్య అలేఖ్య, ఆమె వదిన జయశీల, జయశీల కుమారుడు రియాన్స్ కలిసి ఖానాపూర్‌లోని టైలరింగ్‌కు వెళ్లి నడుచుకుంటూ వస్తుండటాన్ని గమనించాడు. ఇదే అదునుగా భావించి శివాజీనగర్ రోడ్డు దగ్గర అలేఖ్యపై కత్తితో దాడి చేశాడు. ఛాతీ, వెన్ను, పొట్ట భాగంలో పొడవడంతో ఆమె అక్కడికక్కడే చనిపోయింది. అడ్డుకోబోయిన ఆమె వదిన జయశీల చేతికి తీవ్ర గాయాలయ్యాయి. జయశీల కుమారుడు రియాన్ష్ తలకూ గాయమైంది.
ఇది కూడా చదవండి: కేసీఆర్ అంటే త్రీఫేస్ కరెంట్.. ముట్టుకుంటే మాడి మసైపోతరు
