దేశ చరిత్రలోనే తొలిసారిగా సెంట్రల్ ఆర్మ్ డ్ పోలీస్ ఫోర్స్ (సీఏపీఏఫ్)లోని కానిస్టేబుళ్ల నియామకం కోసం కానిస్టేబుల్ (జనరల్ డ్యూటీ) పరీక్షలను 13 ప్రాంతీయ భాషల్లో నిర్వహించనున్నారు. ఇప్పటి వరకు హిందీ, ఇంగ్గిష్ భాషల్లో మాత్రమే నిర్వహిస్తూ వస్తున్నారు. దీంతో ఆయా రాష్ట్రాల అభ్యర్థులకు కేంద్ర ప్రభుత్వ పోలీసు ఉద్యోగాల్లో తీవ్ర అన్యాయం జరిగేది.
ఈ క్రమంలో అన్ని రాష్ట్రాల నుంచి కేంద్రానికి వినతులు వస్తుండటంతో ప్రధాని మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌షా ప్రాంతీయ భాషల్లోనూ పరీక్షలు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు కేంద్ర హోంమంత్రిత్వశాఖ ఆయా రాష్ట్రాలకు సమాచారం ఇచ్చింది. దేశంలో 128 నగరాల్లో ఈనెల 20 నుంచి మార్చి 7 వరకు నిర్వహించే పరీక్షకు సుమారు 48 లక్షల మంది అభ్యర్థులు హాజరుకానున్నారు.
జాతీయ స్థాయి పరీక్షలను హిందీ, ఇంగ్లిష్‌తో పాటు ప్రాంతీయ భాషల్లో నిర్వహించాలని నాటి తెలంగాణ సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ అనేకసార్లు కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చారు. ఎట్టకేలాకు స్పందించిన కేంద్రం ప్రాంతీయ భాషల్లో పరీక్షలు నిర్వహించేందుకు సిద్ధమైంది.
ఇది కూడా చదవండి: కేసీఆర్ అంటే త్రీఫేస్ కరెంట్.. ముట్టుకుంటే మాడి మసైపోతరు
