కృష్ణా జలాల్లో తెలంగాణకు అన్యాయం జరిగిందంటూ లేనిపోని ఆరోపణలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ను బద్నాం చేసే ప్రయత్నం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత. అసెంబ్లీలో ఎమ్మెల్సీ కవిత మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్ ఎట్టి పరిస్థితుల్లోనూ తెలంగాణ నీటి హక్కులను వదులుకునే మనిషి కాదన్నారు. జలాల సాధన కోసమే తెలంగాణ ఉద్యమం చేశామని.. నీటి హక్కుల విషయంలో కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీ ఎప్పటికీ రాజీ పడబోదని తేల్చి చెప్పారు. కృష్ణ నదిపై ఉన్న ప్రాజెక్టులను కేంద్ర ప్రభుత్వానికి అప్పగించబోమంటూ అసెంబ్లీలో తీర్మానం చేయాలని డిమాండ్ చేశారు. చేసిన తప్పును సరిదిద్దుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు ఎమ్మెల్సీ కవిత. తెలంగాణ హక్కుల విషయంలో బీఆర్ఎస్ సంపూర్ణ మద్దత్తు ఉంటుందని స్పష్టం చేశారు.
ఇది కూడా చదవండి:ఛలో నల్లగొండ ఎఫెక్ట్: కేఆర్ఎంబీ ప్రాజెక్టులపై అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టనున్న కాంగ్రెస్
కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణ ప్రాజెక్టులను ధారాదత్తం చేసి రాష్ట్ర ప్రభుత్వం పెద్ద తప్పు చేసిందని, దాన్ని కప్పిపుచ్చుకోవడానికి తమపై లేనిపోని ఆరోపణలు చేస్తోందని విమర్శించారు. కేఆర్ఎంబీకి ప్రాజెక్టులను అప్పచెప్పే నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటూ అసెంబ్లీ, మండలిలో తీర్మానం తీసుకరావాలని, తమ పాపాలను ప్రక్షాళన చేసుకోవాలని సూచించారు.
కృష్ణా నదిపై ఉన్న ప్రాజెక్టులను కేంద్రానికి అప్పజెప్పటం రాష్ట్ర ప్రభుత్వం చేసిన పెద్ద తప్పు. గతంలో కేఆర్ఎంబీకి ప్రాజెక్టులను అప్పచెప్పే నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటూ శాసన సభ, మండలిలో తీర్మానం తీసుకరండి. మీ పాపాలను ప్రక్షాళన చేసుకోండి. తెలంగాణ హక్కుల విషయంలో… pic.twitter.com/30Z3OWL8mo
— Kavitha Kalvakuntla (@RaoKavitha) February 12, 2024
The post ప్రాజెక్టులను కేంద్రానికి అప్పగించబోమంటూ అసెంబ్లీలో తీర్మానం చేయాలి appeared first on tnewstelugu.com.
