టెక్ దిగ్గజాలు ఉద్యోగాలు తొలగించే పనిలో బిజిగా ఉన్నాయి. ఇప్పటికే చాలా కంపెనీలు ఉద్యోగులపై వేటు వేశాయి. తాజాగా అమెరికాకు చెందిన కమ్యూనికేషన్ టెక్నాలజీ కంపెనీ సిస్కో భారీగా ఉద్యోగాలను తొలగించేందుకు ప్రణాళికలు రూపొందిస్తోంది. దీంతోలేఆఫ్స్‌తో ఎంతమందిపై ఎఫెక్ట్ పడుతుందనే వివరాలను సిస్కో ఇప్పటివరకూ తెలపలేదు.
వచ్చే వారం నుంచి వేలాది మంది ఉద్యోగులపై సిస్కో వేటు వేయనుందని చెబుతున్నారు. ఫిబ్రవరి 14న కంపెనీ ఎర్నింగ్ కాల్ సందర్భంగా ఈ వివరాలు తెలిసే అవకాశం ఉంది.సిస్కోలో ప్రపంచవ్యాప్తంగా 84,900 మంది పనిచేస్తుండగా కొలువుల కోతతో ఈ సంఖ్య భారీగా తగ్గనుంది.
2022 నవంబర్‌లో దాదాపు 5 శాతం ఉద్యోగులను తొలగించనున్నట్టు కంపెనీ ప్రకటించడంతో ఈసారి లేఆఫ్స్ ఎలా ఉంటాయని టెకీలు ఆందోళన చెందుతున్నారు.
ఇది కూడా చదవండి:కాంగ్రెస్ తీరుపై ప్రజల్లో తిరుగుబాటు మొదలైంది
