కాంగ్రెస్ పార్టీ అంటేనే అబద్ధాలు, అవాస్తవాల పునాది అని మరోసారి స్పష్టమైందన్నారు బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ వై.సతీష్ రెడ్డి. మొన్న ఎన్నికల్లో 420 హామీలిచ్చి గద్దెనెక్కగానే ప్రజలను నిండా ముంచేశారన్నారు. అంతేకాదు..దారుణంగా మోసం చేశారు. ఇప్పుడు రాష్ట్ర అసెంబ్లీలోనూ అవే తప్పులు చెప్పి రాష్ట్ర అసెంబ్లీ గౌరవాన్ని, మర్యాదను కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా మంటగలిపింది. అబద్దాలను సభలో ప్రస్తావించి.. నిజాలుగా నమ్మించే ప్రయత్నం చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం చెబుతున్నట్టు ఆనాడు కృష్ణా జలాల విషయంలో కేసీఆర్ ప్రభుత్వం తప్పు చేసి ఉంటే, తెలంగాణకు అన్యాయం జరిగేలా నిర్ణయాలు తీసుకుని ఉంటే.. ఇప్పుడు మా బీఆర్ఎస్ పార్టీ కొట్లాడుతున్నట్టు ఆనాడు ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ ఎందుకు కొట్లాడలేదు..? అని ప్రశ్నించారు.
అసెంబ్లీలో మాట్లాడలేదు. నాడు ఎంపీగా ఉన్న ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి, ప్రస్తుత ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎందుకు పార్లమెంట్ లో ప్రస్తావించలేదు.? దీన్ని బట్టే అర్థమవుతోంది కదా ప్రాజెక్టులు అప్పగించేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం ఒప్పుకోలేదనే విషయం. అంతేకాదు.. నిండు సభలో మార్ఫింగ్ చేసిన వీడియోను ఇరిగేషన్ శాఖ మంత్రి ప్రదర్శించారు. మార్ఫింగ్ చేసిన వీడియోను అధికారికంగా అసెంబ్లీలో చూపించి.. సభను, ప్రజలను తప్పుదారి పట్టించేందుకు ప్రయత్నించిన మంత్రిపై వెంటనే చర్యలు తీసుకోవాలి. సైబర్ క్రైం అధికారులు సుమోటోగా కేసు బుక్ చేయాలన్నారు.
వాస్తవాలు చెప్పేందుకు ప్రయత్నించిన మాజీ మంత్రి హరీష్ రావు ను మాట్లాడకుండా సీఎం, మంత్రులు అడ్డుకున్న తీరు దారుణం. దుర్మార్గం. కాంగ్రెస్ తప్పులు, పాపాల చిట్టా బటయపడుతుందన్న భయంతోనే హరీష్ రావు ను అడుగడుగునా అడ్డుకున్నారు. ఉల్టా చోర్ కోత్వాల్ కో డాంటే అన్నట్టు.. తీర్మానం కాకుండా వేరే అంశాలు ప్రస్తావించి.. హరీష్ రావు సభను తప్పుదారి పట్టిస్తున్నారని విమర్శలు చేయడాన్ని బట్టి.. కాంగ్రెస్ ఎంత పెద్ద అబద్దాల కోరు, దగాకోరు అనేది స్పష్టమౌతోందన్నారు వై.సతీష్ రెడ్డి.
ఇది కూడా చదవండి: రాష్ట్రంలో భారీగా జడ్పీ సీఈవోలు, డిప్యూటీ సీఈవోల బదిలీ
The post కాంగ్రెస్.. అసెంబ్లీలోనూ అబద్ధాలే చెప్పింది, చూపించింది appeared first on tnewstelugu.com.
