బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దెబ్బకు కాంగ్రెస్ కకావికలమయ్యింది. నల్లగొండ సభపిలుపుతో కలవరం చెందిన సర్కార్ రాత్రికి రాత్రే అసెంబ్లీ ఎజెండానే మార్చేసింది. క్రుష్ణా ప్రాజెక్టులను కేంద్రాలను అప్పగించి తెలంగాణ ప్రజల నీటి హక్కుకు కాలరాసే ప్రయత్నానికి కేసీఆర్ ఆదిలోనే అడ్డకట్ట వేశారు. తన మార్క్ రాజకీయంతో కాంగ్రెస్ సర్కార్ దిగొచ్చే విధంగా చేశారు. క్రుష్ణా జలాలపై పోరుకు శంఖారావం పూరించారు. మంగళవారం నల్లగొండ జిల్లాలో భారీ బహిరంగ సభకు పిలుపునిచ్చారు కేసీఆర్. కేసీఆర్ నిర్ణయంలో కాంగ్రెస్ లో టెన్షన్ మొదలైంది. దీంతో క్రుష్ణా ప్రాజెక్టుల అప్పగింతపై యూటర్న్ తీసుకుంది. ఇందులో భాగంగానే అసెంబ్లీలో సోమవారం తీర్మానం పేరుతో హడావిడి చేసింది కాంగ్రెస్. అసలు వాస్తవానికి అసెంబ్లీ ఎజెండాలో క్రుష్ణా జలాలపై తీర్మానికి సంబంధించిన అంశమేమీ లేదు.
కానీ మంగళవారం నల్లగొండలో బీఆర్ఎస్ సభ జరుగుతుండటంతో ఈ సభను ఎదుర్కొనేందుకు సోమవారం అసెంబ్లీలో తీర్మానం అంకానికి తెరలేపిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అందుకోసం ఆదివారం రాత్రి అసెంబ్లీ ఎజెండాలో ఈ అంశాన్ని పొందుపరిచింది. వాస్తవానికి సోమవారం బడ్జెట్ పై చర్చ ఉండాలి. దానిని పక్కన పెట్టిన సర్కార్..కృష్ణా జలాలపై తీర్మానాన్ని ముందుకు తీసుకువచ్చింది. మొన్న జరిగిన బీఏసీలోనూ ఈ తీర్మానంపై ఎలాంటి నిర్ణయం జరగలేదు.
కానీ బీఆర్ఎస్ సభతో ప్రజలకు ఎలాగూ వాస్తవం తెలిసిపోతుందని…అప్పుడు ప్రజల ముందు దోషిగా నిలబడాల్సి వస్తుందని భావించిన కాంగ్రెస్ పార్టీ దిద్దుబాటు చర్యలు చేపట్టింది. తాము కూడా క్రుష్ణా ప్రాజెక్టుల అప్పగింతకు వ్యతిరేకమని చెప్పుకొనేందుకు నానా తంటాలు పడుతున్నది. ఈ నేపథ్యంలో కేసీఆర్ తన మార్క్ రాజకీయంతో సభకు ముందే విజయం సాధించారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ పోరాటం ద్వారా ఉమ్మడి, నల్లగొండ, మహబూబ్ నగర్, ఖమ్మం, రంగారెడ్డి జిల్లాల రైతులకు మేలు జరుగుందన్నారు.
ఇది కూడా చదవండి: పేటీఎం బ్యాంక్‌పై చర్యల్ని వెనక్కు తీసుకునే ప్రసక్తే లేదు..!!
