ప్రజాస్వామ్య విలువలు, శాసనసభ సంప్రదాయాలను పూర్తిగా కాంగ్రెస్ ప్రభుత్వం మంటగలిపారని మాజీమంత్రి హరీశ్ రావు విమర్శించారు. అసెంబ్లీ సమావేశం తర్వాత మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. సభలో ప్రతిపక్షానికి మైక్ ఇవ్వకుండా ఏకపక్షంగా వ్యవహరిస్తుందని ఆరోపించారు.
అంతేకాదు కాంగ్రెస్ ప్రభుత్వ మంత్రులు, సీఎం రేవంత్ మేడిగడ్డకు పయనం అయ్యారు. మేడిగడ్డకు వెళ్లి పచ్చటి పొలాలు, పారుతున్న వాగులు చూడండంటూ సీఎం రేవంత్ కు కౌంటర్ ఇచ్చారు హరీష్ రావు. ప్రజాస్వామ్య విలువలు మంట గలిపే విధంగా ఉంది ప్రభుత్వం తీరు ఉందన్నారు. కాళేశ్వరం సమగ్ర స్వరూపం చాలా మందికి తెలియదన్నారు. కాళేశ్వరం అంటే 3 బ్యారేజీలు, 15 రిజర్వాయర్లు, 19 సబ్ స్టేషన్లు, 21 పంప్ హౌజులు, 203 కిలోమీటర్ల సొరంగాలు, 1531 కిలోమీటర్ల గ్రావిటి కెనాల్, 98 కిలోమీటర్ల ప్రెజర్ మెయిన్స్, 141 టిఎంసీల స్టోరేజ్ కెపాసిటీ, 530 మీటర్ల ఎత్తుకు లిఫ్ట్, 240 టిఎంసీల ఉపయోగం… వీటన్నింటి సమాహారం కాళేశ్వరం అంటూ తెలిపారు. ఒక బ్యారేజీలో ఒకటి రెండు కుంగి పోతే కోడి గుడ్డు మీద ఈకలు పీకుతున్నారని ఆగ్రహించారు. మీరు వెళ్ళే దారిలో రంగనాయక సాగర్, మల్లన్న సాగర్, కుడెల్లి వాగు, పచ్చటి పొలాలు చూడండాన్నారు హరీష్ రావు.
కాంగ్రెస్ హయాంలో పంజాగుట్ట ఫ్లే ఓవర్ కూలి 20 మంది చనిపోయారు…దేవాదుల పైపులు పేలి నీళ్ళు ఆకాశమంత ఎగిరాయి. అలాంటి ఘటనలు జరగటం బాధాకరం. కానీ మేము ముందుకు వెళ్ళాం కదా.ప్రాజెక్టులు అప్పగించ వద్దని మేము నిద్ర లేపితే లేచారు. ఈరోజు మా సభ ఉందని మీరు డైవర్ట్ కోసం పోటీ కార్యక్రమం పెట్టారని ఆరోపించిన హరీశ్ రావు ..మీ నీతిని ప్రజలందరూ గమనిస్తున్నారన్నారు.
ఇది కూడా చదవండి:కేసీఆర్ దెబ్బకు..కాంగ్రెస్ కకావికలం..!!
The post ప్రజాస్వామ్య విలువలను కాంగ్రెస్ ప్రభుత్వం మంటగలిపింది appeared first on tnewstelugu.com.
