ఖమ్మం జిల్లాలో విషాదం నెలకొంది. గుండెపోటుతో ఆర్టీసీ డ్రైవర్ మరణించారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. సత్తుపల్లి నుంచి ఖమ్మం బయలుదేరిన బస్సులో డ్రైవర్ శ్రీనివాస్ కు ఛాతిలో నొప్పి వచ్చింది. ఆయన ఆలస్యం చేయకుండా సమయస్పూర్తితో ప్రయాణికులతో ఉన్న బస్సును వెంటనే పక్కన ఆపాడు. ఆ పై దగ్గరలో ఉన్న ఆసుపత్రికి వెళ్లాడు. అక్కడ చికిత్స పొందుతూ శ్రీనివాస్ ప్రాణాలు కోల్పోయాడు. గుండెపోటుతో ఆయన మరణించినట్లు వైద్యులు తెలిపారు. డ్రైవర్ చాకచక్యంగా వ్యవహారించి బస్సును పక్కకు ఆపడంతో పెను ప్రమాదం తప్పినట్లయింది.
ఇది కూడా చదవండి: ఎలక్టోరల్ బాండ్లపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు!
The post విషాదం.. డ్రైవింగ్ చేస్తుండగా గుండెపోటు.. ప్రయాణికులను కాపాడి.. appeared first on tnewstelugu.com.
