తిరుపతి జూ పార్క్‌లో దారుణం జరిగింది. శ్రీ వేంకటేశ్వర జులాజికల్ పార్క్ సందర్శనకు వెళ్లిన ఓ వ్యక్తి లయన్ ఎన్‌క్లోజర్‌లోకి వెళ్లాడు. సెల్ఫీ కోసం వెళ్లగా అతడిపై సింహం దాడి చేయడంతో వెంటనే అతడు చెట్లుపైకి ఎక్కాడు. చెట్టుపైకి ఎక్కిన అతడు ప్రమాదవశాత్తు కిందపడడంతో అతడిపై సింహం దాడి చేసి చంపివేసింది. గమనించిన జూ సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.మృతుడు రాజస్థాన్‌కు చెందిన ప్రహ్లాద్ గుర్జార్ (38)గా గుర్తించారు.
ఇది కూడా చదవండి: విషాదం.. డ్రైవింగ్ చేస్తుండగా గుండెపోటు.. ప్రయాణికులను కాపాడి..
The post తిరుపతి జూలో దారుణం.. సింహం దాడిలో వ్యక్తి మృతి appeared first on tnewstelugu.com.
