కేంద్రంలోని మోదీ సర్కార్ అవలంభిస్తున్న రైతుల, కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ నేడు దేశవ్యాప్తంగా గ్రామీణభారత్ బంద్ నిర్వహిస్తున్నట్లు సంయుక్తి కిసాన్ మోర్చా, కేంద్ర కార్మిక సంఘాలు వెల్లడించాయి. తమ సమస్యలను ప్రజలకు వివరించి..కేంద్ర ప్రభుత్వ తీరును ఎండగట్టేందుకు బంద్ కు పిలుపునిచ్చినట్లు వెల్లడించాయి. శుక్రవారం ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 4గంటల వరకు ఈ బంద్ కొనసాగుతుంది. శుక్రవారం మధ్యాహ్నం 12గంటల నుంచి సాయంత్రం 4గంటల వరకు దేశవ్యాప్తంగా ప్రధాన రహదారులపై రైతులు, కార్మికులు చక్కా జామ్ ను చేపట్టనున్నారు.
వ్యవసాయ, ఉపాధి హామీ పనులు ఉండవని..వ్యవసాయ కూలీలు, గ్రామీణ కార్మికులెవ్వరూ పనిచేయరని..భారతీయ కిసాన్ యూనియన్ నాయకుడు రాకేశ్ టికాయత్ తెలిపారు. కూరగాయల అమ్మకం సహా గ్రామాల్లో సమస్తం బంద్ ఉంటుందన్నారు. అంబులెన్సులు, వివాహాలు, అంత్యక్రియలు, మెడికల్ దుకాణాలు, వార్త పత్రికల సరఫరా, బోర్డు పరీక్షలకు వెళ్లే విద్యార్థులు అత్యవసర సేవలకు బంద్ నుంచి మినహాయింపు ఇచ్చినట్లు ఎస్కేఎం జాతీయ సమన్వయ కమిటీ సభ్యుడు డాక్టర్ దర్శన్ పాల్ తెలిపారు.
ఇది కూడా చదవండి: నేడు రాష్ట్ర వ్యాప్తంగా ఆటోలు బంద్..!!
The post నేడు భారత్ బంద్- ఇంటర్నెట్ బ్యాన్ పొడగింపు..!! appeared first on tnewstelugu.com.
