కాంగ్రెస్ అగ్రనాయకురాలు ఈసారి రాజ్యసభకు నామినేషన్ విషయం తెలిసిందే. రాయ్ బరేలీ సీటును వదులుకుని రాజస్తాన్ నుంచి పెద్దలకు సభకు వెళ్లనున్నారు సోనియాగాంధీ. నామినేషన్ పత్రాలతో పాటు తన పోల్ అఫిడవిట్లో ఆస్తుల వివరాలను సమర్పించారు సోనియాగాంధీ. ఆమె చర, స్థిర ఆస్తుల విలువ రూ. 12,53,76,822గా ఉంది 2014లో సోనియాగాంధీ సంపాదన విలువ రూ. 9.28కోట్లు ఉంటే..2019లో రూ. 11.82కోట్లు పెరిగింది.
ప్రస్తుతం సోనియాగాంధీ దగ్గర కోటిరూపాయల విలువైన ఆభరణాలు ఉన్నాయి. వాటితోపాటు ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ నుంచి వచ్చే రాయల్టీ పెట్టుబడులు, బ్యాంకు డిపాజిట్లు, బాండ్ల ద్వారా ఆమె చరాస్తులు రూ. 6.38కోట్లుగా ఉన్నాయి. వీటి ద్వారా వచ్చే వడ్డీ, ఎంపీ జీతమే తన ఆదాయ వనరని ఆమె పేర్కొన్నారు.
ఇక తన స్వదేశమైన ఇటలీలో తనకు వారసత్వంగా వచ్చిన ఇంటి విలువ గురించి కూడా ప్రస్తావించారు. 2014లో ఆ ఇంటి విలువ రూ. 19.9 లక్షలు కాగా ప్రస్తుతం మార్కెట్ విలువ ప్రకారం రూ. 27లక్షలు పలుకుతోంది. ఇక తనకు పర్సనల్ గా ఎలాంటి సోషల్ మీడియా అకౌంట్లు లేవని ఆఫిడవిట్ లో సోనియా పేర్కొన్నారు.
తాను ఇంతవరకు ఏ క్రిమినల్ కేసులోనూ దోషిగా తేలలేదని తెలిపారు. కాగా దేశవ్యాప్తంగా 15 రాష్ట్రాల్లో 56 మంది రాజ్యసభ సభ్యుల పదవీకాలం ఏప్రిల్ ముగియనుండటంతో ఈ స్థానాలకు కేంద్ర ఎన్నికల సంఘం జనవరిలో నోటిఫికేషన్ విడుదల చేసింది. ఫిబ్రవరి 27వ తేదీని పోలింగ్ జరగనుంది.
ఇది కూడా చదవండి: బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్: మూడు నెలలు చికెన్ షాపులు బంద్
