ఉద్యమసారథి, తెలంగాణ జాతిపిత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు 70వ ఏట అడుగుపెడుతున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంతోపాటు ప్రపంచవ్యాప్తంగా సంబురాలు ఘనంగా జరగనున్నాయి. గులాబీదళపతి అభిమానులు, పార్టీ శ్రేణులు వేడుకలకు రెడీ అయ్యారు. కేసీఆర్ పుట్టినరోజు వేడుకలను ప్రపంచవ్యాప్తంగా ఘనంగా నిర్వహించేందుకు ఎన్నారైలు సిద్ధమయ్యారు. రక్తదాన శిబిరాలు, మొక్కలు నాటడం, అనాథలకు సహాయం అదించడం చేస్తామని తెలిపారు. ఆస్ట్రేలియాలో కేసీఆర్ పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు.
సిడ్ని డిలైడ్, మెల్బోర్న్, కాన్బెర్రా, బ్రిస్బేన్, గోల్డ్ కోస్ట్, బెండీగో, బల్లారాట్ నగరాల్లో బీఆర్ఎస్ ఆస్ట్రేలియా శాఖ అధ్యక్షుడు కాసర్ల నాగేందర్‌రెడ్డి అధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించారు. బీఆర్ఎస్ ఆస్ట్రేలియా నాయకుడు సాయిరాం ఉప్పు ఆధ్వర్యంలో మెల్బోర్న్లో వేడుకలు నిర్వహించారు. వినయ్‌గౌడ్ సన్నీ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం చేపట్టి రక్తదానం చేశారు. బ్రిస్బేన్‌లో విన్నీ తూముకుంట, సిడ్నీలో రవిశంకర్ దుపాటి, అడిలైడ్‌లో రవియాదవ్, కాన్బెర్రాలో రవి సాయల ఆధ్వర్యంలో సంబురాలు నిర్వహించారు. ఉదయ్‌రెడ్డి, విశ్వామిత్ర మంత్రి పడగ, సునీల్‌రెడ్డి, శివ బిళ్ల, సుకుమార్ ఇతర సంఘాల నాయకులు పాల్గొన్నారు. కాగా, శనివారం కేక్ కటింగ్, పండ్ల పంపిణీ చేపట్టాలని బీఆర్ఎస్వీ అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్‌యాదవ్ పిలుపునిచ్చారు.
కేసీఆర్ 70వ పుట్టినరోజు సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా శనివారం ప్రతిఒక్కరూ 3 మొక్కలు నాటాలని గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఛైర్మన్ రాజ్యసభ ఎంపీ సంతోష్ కుమార్ కోరారు. ఎక్స్ వేదికగా ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు.
Celebrating a Legend – Telangana’s First Chief Minister, #KCR Sir Birthday with a Green Twist!
Fellow Telanganites, what better way to honor our #TelanganaJaathipitha than by nurturing Mother Earth? Tomorrow on our KCR Sir birthday, I urge you all to embrace the #Vrukshaarchana… pic.twitter.com/2VQbtmiIzz
— Santosh Kumar J (@SantoshKumarBRS) February 16, 2024
