కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన శ్వేతపత్రం సత్యదూరంగా ఉందన్నారు మాజీ మంత్రి హరీశ్ రావు.సభలో ఇచ్చిన పుస్తకం తప్పులతడకగా ఉందన్నారు. నీటిపారుదల రంగంపై అసెంబ్లీలో రాష్ట్ర ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేసింది. దీనిపై మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. మంత్రి లేవనెత్తిన అంశాలపై హరీశ్‌రావు వివరణ ఇచ్చారు.
గత ప్రభుత్వంపై బురదజల్లేందుకే ఈ నివేదిక తీసుకొచ్చారు. ఇందులో అబద్ధాలు ఉన్నాయని నేను రుజువు చేస్తాను. మిడ్‌మానేరు, ఎల్లంపల్లి ప్రాజెక్టులు ఉమ్మడి రాష్ట్రంలోనే పూర్తయ్యాయని మంత్రి ఉత్తమ్ చెప్పారు. అయితే, 2014 నాటికి నేను మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే సమయానికి మిడ్‌మానేరు ప్రాజెక్టుకు సంబంధించి రూ.106 కోట్ల విలువైన పనులు మాత్రమే జరిగాయి. బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక రూ.775 కోట్లు ఖర్చు చేసి మూడేళ్ల తర్వాత ప్రాజెక్టును పూర్తి చేసి నీళ్ళు ఇచ్చాం.
ఖర్చు, ఆయకట్టు విషయంలో శ్వేతపత్రంలో రెండు చోట్ల వేర్వేరుగా ప్రస్తావించారు. ఒక్కో పేజీలో ఒక్కో విధంగా చెప్పారు. 2014కు 57.79 లక్షల ఎకరాలకు నీరిస్తే.. రూ. 54,234 కోట్లు ఖర్చు చేసినట్లు చెప్పారు. ఇదే నివేదికలో మరో చోట 1956-2014 మధ్య కాలంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని తెలంగాణలో రూ.54,234 కోట్లు ఖర్చు పెట్టి 41.76 లక్షల ఎకరాలను నీరిచ్చాం అని చెప్పారు. ఒకే అంశంపై భిన్నమైన సమాచారాన్ని నివేదికలో పొందుపర్చారు. ఖర్చులో ఎలాంటి మార్పు లేదు. నీరందించిన ఆయకట్టు విస్తీర్ణంలో మాత్రం తేడా ఉంది.
రాయలసీమ లిఫ్ట్ విషయంలో మేము కేంద్రానికి పిర్యాదు చేయలేదన్నారు. తప్పు అది. 5- 5- 2020 జీఓ నాడు వచ్చింది. అయితే జనవరి లోనే మేము కేంద్రానికి ఫిర్యాదు చేశాము. ఈ అంశానికి సంబంధించి గతంలోనే పూర్తి ఆధారాలతో సహా నేను పూర్తి వివరణ ఇచ్చాను. అయినా సరే మళ్లీ అబద్ధాలు చెబుతున్నారు. మే 5న జీవో వస్తే వారం రోజుల వ్యవధిలోనే మరోసారి కేంద్రానికి, కేఆర్‌ఎంబీకి ఫిర్యాదు చేశాం. ఆ లెటర్లు కావాలంటే సభలో ప్రవేశపెడతాం.
కె ఆర్ ఎం బి కి అప్పగించాలని గెజిట్ ఇస్తే మేము సవాల్ చేయలేదు అని పేజీ 14 లో చెప్పారు. అది తప్పు మేము వ్యతిరేకిస్తూ అపెక్స్ కౌన్సిల్ రిఫర్ చేయాలని చెప్పాము. కెఅర్ఎంబి కి అప్పగించింది మేము అన్నారు. అవాస్తవం. మీరు అధికారంలోకి వచ్చాక బోర్డుకు అప్పగించినట్లు చెప్పే మినట్స్ ఆఫ్ ద మీటింగ్ ముందు పెట్టాము. ఇదే విషయం అన్ని పత్రికల్లో వచ్చింది. 50:50 రేషియో కోసం మేము కొట్లడలేదు అన్నారు. రాష్ట్ర విభజన నుండి ఎన్నోసార్లు కొరాము. ఫిర్యాదులు చేశాం. న్యాయమైన వాటా కోసం ట్రిబ్యునల్ వేయాలని డిమాండ్ చేస్తూ వచ్చామని తెలిపారు మాజీ మంత్రి హరీశ్ రావు.
ఇది కూడా చవండి:కులగణనకు కాంగ్రెస్ ప్రభుత్వం చట్టబద్ధత కల్పించాలి
