పీచు మిఠాయి అమ్మకాలపై తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వీటిల్లో క్యాన్సర్ కారక రసాయనాలు ఉన్నాయని పరిశోధనల్లో తేలడంతో వాటిని సేల్ చేయకూడదంటూ నిషేధించింది. దీనికి సంబంధించి ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సుబ్రమణియన్ ఇవాళ(శనివారం) తెలిపారు. పీచు మిఠాయి నాణ్యతను పరీక్షించేందుకు ఇటీవల ఫుడ్ సేఫ్టీ విభాగం అధికారులు చెన్నైలో తనిఖీలు నిర్వహించారు. ఈ నమూనాల అధ్యయనంలో రోడమైన్-బి అనే రసాయనాన్ని గుర్తించారు. కృత్రిమ రంగు కోసం పీచు మిఠాయిలో దీనిని వినియోగిస్తున్నట్లు గుర్తించారు.
రోడమైన్-బీని ఇండస్ట్రియల్ డైగా పిలుస్తారు. బట్టల కలరింగ్, పేపర్ ప్రింటింగ్‌లలో దీనిని ఎక్కువగా వినియోగిస్తారు. ఫుడ్ కలర్ కోసం దీనిని ఉపయోగించే అవకాశం లేదు. ఎందుకంటే దీనితో దీర్ఘకాలంలో సమస్యలు తలెత్తే అవకాశం ఉందని, ఈ రసాయనం శరీరంలోకి వెళితే కిడ్నీ, లివర్ పైన ప్రభావం చూపుతుందని, అల్సర్‌తో పాటు క్యాన్సర్‌కు దారి తీసే ప్రమాదం ఉందని నిపుణులు గుర్తించారు. ఈ క్రమంలో పీచు మిఠాయిలలో దీనిని ఉపయోగిస్తున్నందున వీటి అమ్మకాలపై ప్రభుత్వం నిషేధం విధించింది.
ఇది కూడా చదవండి: రాష్ట్రంలో 12 మంది అడిషనల్ ఎస్పీలకు స్థానచలనం
