
అమరావతి: ప్రయాణికుల సౌకర్యార్థం విజయవాడ నుంచి మహబూబ్‌నగర్‌కు ప్రత్యేక రైలును ఏర్పాటు చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు. డిసెంబర్ 6 నుంచి 28వ తేదీ వరకు విశాఖపట్నం నుంచి మహబూబ్‌నగర్‌కు ప్రత్యేక రైలును 08585/08586 నంబర్‌తో నడుపుతున్నట్లు వెల్లడించారు.
విశాఖపట్నంలో సాయంత్రం 5.35 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 10.30 గంటలకు మహబూబ్ నగర్ చేరుకుంటుందని వివరించారు. తిరుగు ప్రయాణంలో అదే రైలు మహబూబ్‌నగర్‌లో సాయంత్రం 6.20 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 9.50 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది. ఈ రైళ్లు విజయవాడ మీదుగా వెళ్తాయి.
851546
