లోక్సభ ఎన్నికలకు సమయం దగ్గరపడుతోంది. దీంతో రాజకీయ పార్టీలు తమ ప్రచారాన్ని ఇప్పటికే మొదలు పెట్టేశాయి. ఈ నేపథ్యంలో లోక్సభ ఎన్నికలపై ప్రముఖ సినీ నటుడు, మక్కల్ నీది మయ్యం చీఫ్ కమల్ హాసన్ తాజాగా స్పందించారు. రెండు రోజుల్లో గుడ్న్యూస్ ఉంటుందని తెలిపారు. ఇవాళ( సోమవారం) ఉదయం చెన్నై ఎయిర్పోర్ట్ లో విలేకరులతో మాట్లాడుతూ.. పొత్తుపై రెండు రోజుల్లో ప్రకటన వస్తుందని చెప్పారు. పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించిన పనులు బాగా జరుగుతున్నాయి. మంచి అవకాశం వస్తుందని ఆశిస్తున్నాను. పొత్తుకు సంబంధించి రెండు రోజుల్లో నిర్ణయం ప్రకటిస్తామన్నారు కమల్.
ఇప్పటికే లోక్సభ ఎన్నికలకు ముందు తమిళనాడు రాష్ట్రంలో కమల్ పార్టీతో అధికార డీఎంకే పొత్తు ఉంటుందని ప్రచారం జరుగుతోంది.
ఇది కూడా చదవండి: నాలుగు రోజులు ప్రయాణాలను వాయిదా వేసుకోండి… ఆర్టీసీ రిక్వెస్ట్
