తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటి ఆర్థిక సాయం చేయడానికైనా తాను రెడీగా ఉంటానన్నారు బాలీవుడ్ నటుడు సోనూసూద్. ఇవాళ(సోమవారం) హైదరాబాద్ శంషాబాద్ మున్సిపాలిటీ పరిధి సిద్ధాంతి గ్రామంలో ప్రభుత్వ పాఠశాల భవనాన్ని ఎంపీ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ తో కలిసి సోనూసూద్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడిన సోనూ.. తెలంగాణ, ఏపీ రెండు రాష్ట్రాల్లో ఎక్కడైనా సరే ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రభుత్వ పాఠశాలలు ఏదైనా సహాయం కోరితే తాను తప్పకుండా చేస్తానన్నారు.
తన భార్య తెలుగు రాష్ట్రానికి చెందిన వ్యక్తన్నారు సోనూసూద్. తనకు తెలుగు రాష్ట్రాలతో ప్రత్యేక అనుభందం ఉందన్నారు .ఇవాళ శంషాబాద్ పరిధిలోని సిద్ధాంతి గ్రామంలో ఇంత గొప్ప కార్యక్రమంలో పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఇంత సంతోషం టాలీవుడ్ బాలీవుడ్ సినిమాల్లో నటించినప్పుడు కూడా లేదన్నారు. సామాజిక సేవకు ఉన్న ప్రత్యేకత వేరన్నారు సోనూసూద్.
The post ఆస్పత్రులకు, స్కూళ్లకు సాయం చేసేందుకు ఎప్పుడూ సిద్ధం appeared first on tnewstelugu.com.
