లిక్కర్ కుంభకోణంలో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మరోసారి ఈడీ విచారణకు హాజరు కాలేదు. ఎక్సైజ్ పాలసీకి సంబంధించి ఇవాళ(సోమవారం) విచారణకు రావాలని ఈడీ (ED) అధికారులు కేజ్రీవాల్‌కు ఆరోసారి నోటీసులు జారీ చేసింది. ఈడీ విచారణకు సీఎం హాజరుకావడం లేదని ఆప్ (AAP) వర్గాలు తెలిపాయి. సమన్లు చట్ట వ్యతిరేకమని చెప్పాయి. ఈడీ సమన్ల చట్టబద్ధతపై కోర్టులో కేసు నడుస్తున్నదని తెలిపాయి. కోర్టులో కేసు ఉండగా ఈడీ మళ్లీ మళ్లీ సమన్లు పంపుతోందని పార్టీ నాయకులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. కోర్టు నిర్ణయం వచ్చేవరకు ఈడీ ఆగాల్సిందేనని స్పష్టం చేశారు.
ఇది కూడా చదవండి: నాలుగు రోజులు ప్రయాణాలను వాయిదా వేసుకోండి… ఆర్టీసీ రిక్వెస్ట్
