కేరళ లో ఎండలు దంచికొడుతున్నాయి. పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు అకస్మాత్తుగా పెరిగాయి. దీంతో ఆ రాష్ట్ర వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. 6జిల్లాలకు ఐఎండీ వార్నింగ్ ఇచ్చింది. ఎర్నాకుళం, త్రిసూర్, కన్నూరు, అలప్పుజా, కొట్టాయం, కోజికోడ్ జిల్లాల్లో ఇవాళ(సోమవారం), రేపు(మంగళవారం) అధిక ఉష్ణోగ్రతలు నమోదు కానున్నట్లు ఐఎండీ తెలిపింది. అలర్ట్ ప్రకారం ఎర్నాకుళం, త్రిసూర్, కన్నూరు జిల్లాల్లో అత్యధికంగా 37 డిగ్రీల టెంపరేచర్ నమోదు కానుంది. ఇక అలప్పుజా, కొట్టాయం, కోజికోడ్ జిల్లాల్లో 36 డిగ్రీలు నమోదు కానున్నట్లు ఐఎండీ తెలిపింది. సాధారణ స్థాయి కన్నా.. సుమారు 4 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు ఆ జిల్లాల్లో నమోదు కానున్నట్లు ఐఎండీ అలర్ట్ చేసింది.
నిజానికి మార్చి నుంచి జూన్ మధ్య కాలంలో కేరళలో అధిక ఉష్ణోగ్రతలే ఉంటాయి. కానీ ఈసారి ఫిబ్రవరిలోనే వెదర్ వేడెక్కినట్లు తెలుస్తోంది. వడదెబ్బ నుంచి రక్షణ పొందేందుకు ప్రజలు తగిన చర్యలు తీసుకోవాలని కేరళ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ తెలిపింది.
ఇది కూడా చదవండి: బీజేపీలో చేరిన మరో కాంగ్రెస్ మాజీ మంత్రి
The post భారీగా పెరిగిన ఉష్ణోగ్రతలు.. 6 జిల్లాలకు ఎల్లో అలర్ట్ appeared first on tnewstelugu.com.
