అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం రేపాయి. టెక్సాస్ సరిహద్దులో జరిగిన కాల్పుల్లో 12మంది సాయుధులను మెక్సికో సైన్యం హతమార్చింది. అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం..టెక్సాస్ లోని రోమా సరిహద్దుకు సమీపంలో మెక్సికోని మిగ్యుల్ అలెమాన్ టౌన్ షిప్ లో సైనికులపై గుర్తుతెలియని వ్యక్తులు తుపాకులతో దాడులకు తెగబడ్డారు.
వెంటనే సైనికులు ఎదురు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో 12 మంది సాయుధులు మరణించారు. ఘటనాస్థలం నుంచి 12 రైఫిళ్లను స్వాధీనం చేసుకున్నట్లు భద్రతావర్గాలు తెలిపాయి. అయితే మరణించిన వారి వివరాలు తెలియరాలేదు. మిగ్యుల్ అలెమాన్ ప్రాంతంలో చాలా కాలంగా వ్యవస్థీక్రుత నేర మఠాల మధ్య ఆధిపత్య పోరు సాగుతూనే ఉంది.
ఇది కూడా చదవండి: సమంత…చైతూతో విడాకులు తీసుకుంది అందుకేనట…ఆమెనే కారణమంటూ..!!
