మెదక్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు, బైక్ ఢీకొన్న ఘటనలో ముగ్గురు యువకులు అక్కడిక్కడే మరణించారు. ఈ ఘటన మెదక్ జిల్లా అల్లాదుర్గం మండలం గడిపెద్దాపూర్ దగ్గర సోమవారం రాత్రి చోటుచేసుకుంది నాందేడ్ అలోలా 161వ జాతీయ రహదారిపై జరిగిన ఈ ప్రమాదంలో ముగ్గురు యువకులు అక్కడిక్కడే మరణించగా…మరో యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. గాయలైన యువకుడి పరిస్థితి కూడా విషమంగానే ఉన్నట్లే తెలుస్తోంది.
పోలీసులు తెలిపిన పూర్తి వివరాల ప్రకారం..ఒకే బైక్ మీద నలుగురు యువకులు జాతీయ రహదారిపై రాంగ్ రూట్లో వెళ్తుండగా కారు ఢీకొట్టింది. మరణించిన యువకులు పాపన్నపేట మండటం బాచారం గ్రామానికి చెందినవారిగా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని ఆరా తీశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇది కూడా చదవండి: 563 పోస్టులతో గ్రూప్-1 నోటిఫికేషన్ విడుదల…23 నుంచి ఆల్ లైన్లో దరఖాస్తులు..!!
