విద్యార్థుల ప్రవర్తనను, శ్రద్దను మరింత మెరుగుపరిచేందుకు పాఠశాలల్లో మొబైల్ వినియోగాన్ని నిషేధించాలని యూకే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తరగతి గదుల్లో అంతరాయాలను తగ్గించడంతోపాటు విద్యార్థులు ప్రవర్తనను మెరుగుపరిచే ప్రణాళికలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. పాఠశాలలు పిల్లలు నేర్చుకునే ప్రదేశాలని, మొబైల్ ఫోన్లు తరగతిగదిలో అవాంఛనీయమైన పరధ్యానాన్ని కలిగిస్తాయని బ్రిటన్ విద్యాశాఖ మంత్రి గిలియన్ కీగన్ పేర్కొన్నారు. బ్రేక్, లంచ్ సమయంలో కూడా మొబైల్ ఫోన్ల వినియోగాన్ని నిషేధిస్తున్నట్లు తెలిపారు. నిబంధనలు ఉల్లంఘించిన విద్యార్థులు నిర్భంధం ఎదుర్కొవల్సి ఉంటుందని తెలిపింది.
ఇది కూడా చదవండి: అనుమానస్పద స్థితిలో ఐదోతరగతి విద్యార్థిని మృతి..!!
