హైదరాబాద్ : ప్రభుత్వం అందించే పథకాలను నేరుగా లబ్ధిదారులకే అందజేస్తామని, మధ్య దళారులను నమ్మి డబ్బులు ఎవరూ ఇవ్వవద్దని, ఎవరైనా డబ్బులు అడిగితే తమకు తెలియజేయాలని ఎమ్మెల్యే దానం నాగేందర్ కోరారు.
ఖైరతాబాద్ నియోజకవర్గంలోని వెంకటేశ్వర కాలనీ డివిజన్‌కు చెందిన దాదాపు 2000 మంది లబ్ధిదారులకు ఎమ్మెల్యే దాన నాగేందర్ స్థానిక సంస్థ మన్నె కవితారెడ్డితో కలిసి పింఛన్లు అందజేస్తున్నారు.
ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని సియం కేసీఆర్ అందిస్తున్న సంక్షేమ పథకాలు పేదలకు అందుతాయని దాన నాగేందర్ అన్నారు. మరికొద్ది రోజుల్లో నియోజకవర్గ వ్యాప్తంగా దళిత బంధు లబ్ధిదారులకు పంపిణీ చేస్తామని, దళితులందరికీ విడతల వారీగా దళిత బంధు పంపిణీ చేస్తామని తెలిపారు.
