కరీంనగర్ లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. సుభాష్ నగర్ లోని ఓ ఇంట్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. క్రమంగా పక్కన ఉన్న పూరిళ్లకు మంటలు వ్యాపించాయి. దీంతో ఐదు వంటగ్యాసు సిలిండర్లు పేలాయి. దీంతో పెద్దెత్తున మంటలు ఎగిసిపడుతున్నాయి. ఈ మంటలు పరిసర ప్రాంతాలకు వ్యాపించాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకున్నారు. మంటలను అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇళ్లలో నివసి్తున్నవారు మేడారం జాతరకు వెళ్లడంతో పెద్దెత్తున ప్రాణ నష్టం తప్పింది. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
ఇది కూడా చదవండి: సినీ ఇండస్ట్రీలో మరో విషాదం..గుండెపోటుతో ప్రముఖ నటుడు మృతి..!!
The post కరీంనగర్లో భారీ అగ్నిప్రమాదం.. పేలిన గ్యాస్ సిలిండర్లు..!! appeared first on tnewstelugu.com.
