Minister Thummala | ప్రజాప్రతినిధులు(Political leaders) నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండాలి. ప్రజల సమస్యలు తెలసుకొని వాటిని పరిష్కరించాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు(Minister Thummala) అన్నారు.
హైదరాబాద్ : ప్రజాప్రతినిధులు(Political leaders) నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండాలి. ప్రజల సమస్యలు తెలసుకొని వాటిని పరిష్కరించాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు(Minister Thummala) అన్నారు. కాంగ్రెస్ పార్టీపై ప్రజలు ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టాలని సూచించారు. ప్రజల కష్ట, నష్టాల్లో పాలు పంచుకున్నప్పుడే వారు మన వెంట ఉంటారని పేర్కొన్నారు. భేషజాలకు పోకుండా ప్రతి నాయకుడు ప్రజలతో మమేకం కావాలని పిలుపునిచ్చారు. పదవులు శాశ్వతం కాదు, మనం చేసిన సేవే ప్రజల్లో చిరకాలం నిలిచిపోతుందన్నారు.
