Swami Prasad Maurya: సమాజ్‌వాదీ పార్టీ జాతీయ కార్యదర్శి స్వామి ప్రసాద్ మౌర్య తన పదవికి వారం క్రితమే రాజీనామా చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఇవాళ ఆయన మరో నిర్ణయాన్ని ప్రకటంచారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తున్నట్లు వెల్లడించారు.
లక్నో: సమాజ్‌వాదీ పార్టీ జాతీయ కార్యదర్శి స్వామి ప్రసాద్ మౌర్య(Swami Prasad Maurya) తన పదవికి వారం క్రితమే రాజీనామా చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఇవాళ ఆయన మరో నిర్ణయాన్ని ప్రకటంచారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ నేపథ్యంలో ఆయన ఓ ట్వీట్ కూడా చేశారు. మీతో పనిచేసేందుకు అవకాశం వచ్చిందని, ఫిబ్రవరి 12వ తేదీన జరిగిన చర్చల తర్వాత ఆ మరుసటి రోజే జాతీయ కార్యదర్శి పదవికి రాజీనామా చేశానని, ఇప్పుడు ప్రైమరీ మెంబర్‌షిప్‌కు కూడా రాజీనామా చేస్తున్నట్లు ఆయన తెలిపారు. తన రాజీనామా లేఖను సమాజ్‌వాదీ నేత అఖిలేశ్ యాదవ్‌కు చేరవేశారు. ఆ లెటర్‌ను ఆయన సోషల్ మీడియాలో షేర్ చేశారు.
संज्ञानार्थ,@yadavakhilesh pic.twitter.com/C3RnzRnrPU
— Swami Prasad Maurya (@SwamiPMaurya) February 20, 2024
