ప్రపంచ క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని వేచిచూస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్- 17వ సీజన్ వచ్చే నెలలో మొదలవుతుందని బీసీసీఐ తెలిపింది. అయితే.. తేదీ విషయంలో మాత్రం క్లారిటీ రాలేదు. ఈ ఏడాది దేశంలో సాధారణ ఎన్నికల నేపథ్యంలో ఐపీఎల్‌ను రెండు దఫాలుగా జరిపిస్తారని ఊహాగానాలు వినిపిస్తున్నా ప్రారంభ తేదీ ఇంకా వెలువడలేదు. తాజాగా ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ ఛైర్మన్ అరుణ్ ధుమాల్ ఈ టోర్నీ ప్రారంభమయ్యే తేదీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మార్చి 22 నుంచి 17వ సీజన్‌ను చెన్నై వేదికగా మొదలుపెట్టనున్నట్టు ధుమాల్ తెలిపారు.
మార్చి 22 నుంచి ఐపీఎల్ -17ను ఆరంభించాలని మేం ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు అరుణ్ ధుమాల్. దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వంతో పాటు ప్రభుత్వ ఏజెన్సీలతోనే సమన్వయం చేసుకుంటున్నామన్నారు. టోర్నీలో కొంత షెడ్యూల్‌ను ముందు విడుదల చేస్తాం. ఈ సీజన్‌లో మ్యాచ్‌లు మొత్తం భారత్‌లోనే జరుగుతాయన్నారు.
ఇది కూడా చదవండి:పది, ఇంటర్ బోర్డు పరీక్షలు ఇక ఏడాదికి రెండుస్లారు
