కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీ హామీలు ఆరు గ్యారేజీలుగా మారాయని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి విమర్శించారు. విజయ సంకల్ప్ యాత్రలో భాగంగా మహబూబ్‌నగర్‌లో ఇవాళ(బుధవారం) ఆయన మీడియాతో మాట్లాడుతూ. ఆరు గ్యారెంటీల అమలుకు నిధులు ఎలా సమకూరుస్తారో చెప్పాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
హామీల అమలు కోసం నిధులు సమకూర్చడంపై కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రణాళిక లేదన్నారు. ఆరు గ్యారెంటీలు ఎప్పుడు అమలు చేస్తారో చెప్పాలన్నారు. కర్ణాటకలో కరెంటు సమస్యతో రైతులు రోడ్డున పడ్డారన్నారు. కేవలం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ద్వారా తెలంగాణ ప్రజల జీవితాలు బాగుపడతాయనుకోవడం సరికాదన్నారు. రాష్ట్రంలో నిరుద్యోగులు నిర్లక్ష్యానికి గురవుతున్నారని ఆరోపించారు.
వోకల్ ఫర్ లోకల్ నినాదంతో చేనేత ఉత్పత్తులకు ప్రచారం కల్పిస్తున్న మోడీ ప్రభుత్వం నేతన్నలకు అండగా ఉండడమే కాక ప్రధానమంత్రి మోడీ స్వయంగా వారంలో ఒకరోజు తప్పకుండా చేనేత వస్త్రాలు ధరిస్తారని తెలిపారు కిషన్ రెడ్డి. విజయ సంకల్ప యాత్రలో భాగంగా నేడు నారాయణ పేటలో నేతన్నలను కలిసి ఆయన మాట్లాడారు.. నారాయణ పేటలో చీరలు నేస్తున్న నేతన్నలతో పాటుగా కాసేపు మగ్గం నేసి, అక్కడి నేతన్నలు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. నేతన్నలను ఆదుకునేందుకు మోడీ పలు పథకాలను ప్రవేవపెట్టారని,వాటిని వినియోగించుకోవాలని కోరారు.
ఇది కూడా చదవండి: గ్రూప్ -1 నోటిఫికేషన్ పై ట్విట్టర్లో కాంగ్రెస్‌పై ఎమ్మెల్సీ కవిత ఫైర్
The post కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలు ఆరు గ్యారేజ్ లలో చేరాయి appeared first on tnewstelugu.com.
