Close Menu
  • Telugu today
  • తాజా వార్తలు
  • వార్తలు
Facebook X (Twitter) Instagram
Trending
  • Gamble Caribbean Hold’em Casino poker on the internet pokie
  • Better No deposit Local casino Bonuses 2024 » 100 percent free Bucks & Free Spins
  • The Increase of Student-Driven Encyclopedias: Changing Understanding Landscapes
  • Finest Cellular Casinos: Greatest Us Cellular Gambling enterprise Applications and Advertisements within the 2025
  • Best Mobile Web based poker Software the real deal Cash on apple’s ios & Android os within the 2025
  • Greatest ten Online gambling Programs for real Cash in 2025
  • Casino utan svensk licens 2025 – Topp 10 casino utan Spelpaus
  • Bet with Sahabet 💰 Bonus up to 10000 Rupees 💰 Play Online Casino Games
Telangana Press
  • Telugu today
  • తాజా వార్తలు
  • వార్తలు
Telangana Press
వార్తలు

కళ తప్పిన ప్రాజెక్టులు-Namasthe Telangana

TelanganapressBy TelanganapressFebruary 21, 2024No Comments

నాగర్‌కర్నూల్‌ జిల్లాలో సాగు దాదాపు సగానికి ప డిపోయింది. గత పదేండ్లలో లేని విధంగా యాసం గి సాగు తగ్గిపోవడం గమనార్హం. గతేడాది వానకాలంలో నెలకొన్న వర్షాభావ పరిస్థితులతో ఎగువన కృష్ణానదికి వరదలు రాలేదు.

February 22, 2024 / 02:35 AM IST
కళ తప్పిన ప్రాజెక్టులు

నాగర్‌కర్నూల్‌, ఫిబ్రవరి 21(నమస్తే తెలంగాణ) : నాగర్‌కర్నూల్‌ జిల్లాలో సాగు దాదాపు సగానికి ప డిపోయింది. గత పదేండ్లలో లేని విధంగా యాసంగి సాగు తగ్గిపోవడం గమనార్హం. గతేడాది వానకాలంలో నెలకొన్న వర్షాభావ పరిస్థితులతో ఎగువన కృష్ణానదికి వరదలు రాలేదు. ఫలితంగా కృష్ణానది నీటి ఆధారంగా నిర్మించిన మహాత్మాగాంధీ కల్వకు ర్తి ఎత్తిపోతల పథకంపై ప్రభావం పడింది. శ్రీశైలం బ్యాక్‌వాటర్‌ ఆధారంగా నిర్మించిన కల్వకుర్తి ప్రాజెక్టు పరిధిలో జిల్లాలో రైతన్నలు సాగు చేస్తున్నారు. గత సీజన్‌లో జిల్లాలో 3,12,096 ఎకరాల విస్తీర్ణంలో పంటల సాగు చేశారు. ఈ సీజన్‌లో రై తులు నీటి లభ్యత దృష్ట్యా పంటల సాగును తగ్గించారు. దీనివల్ల ఈ సీజన్‌లో జిల్లాలో 3,15,919 ఎకరాల్లో పంటల సాగు జరుగుతుందని అంచనా. కాగా, ఇప్పటి వరకు అధికారుల అంచనా ప్రకారం 2,20,959 ఎకరాల్లో మాత్రమే పంటల సాగు చేస్తుండగా దాదాపుగా లక్ష ఎకరాల విస్తీర్ణం తగ్గడం గమనార్హం. శ్రీశైలం రిజర్వాయర్‌లో కృష్ణానదీ జలాల మట్టం బాగా తగ్గిపోవడంతో కల్వకుర్తి ప్రాజెక్టుకు నీటి విడుదల నిలిచిపోయింది. గతేడాది మార్చి చివరి వరకూ నీళ్లు విడుదల చేయగా ఇప్పు డు డిసెంబర్‌ నుంచే అధికారులు నీటి విడుదలను నిలిపివేశారు. రైతుల పంటలు ఎండిపోయే పరిస్థితులు ఏర్పడడంతో ఒకట్రెండు సార్లు నీటిని విడుదల చేశారు.

కాగా శ్రీశైలం ప్రాజెక్టులో నీటి నిల్వలు డెడ్‌ స్టోరేజీకి చేరాయి. వానకాలంలో వానలు, వరదలు లేకపోవడంతోపాటుగా గతంలో జరిగిన విద్యుదుత్పత్తికితోడు ప్రస్తుతం ముచ్చుమర్రి ద్వా రా నీటిని సీమకు ప్రతిరోజూ తరలిస్తుండడంతో ప్ర స్తుతం రిజర్వాయర్‌ 817 అడుగులకు చేరుకోగా 38 టీఎంసీల నీళ్లే నిల్వ ఉన్నాయి. దీనివల్ల కల్వకు ర్తి పరిధిలో ఆయకట్టు భవిత ప్రశ్నార్థకంగా మారిం ది. జిల్లాలో 4లక్షల ఎకరాలకు సాగునీరు అందించే ప్రాజెక్టు ఇప్పుడు 2.50లక్షల ఎకరాలకు నీటిని అందించలేకపోతుంది. చాలా వరకు చెరువులు ఎం డిపోయే దశకు చేరుకున్నాయి. చిన్నచిన్న కుంటలుగా మారాయి. మండలంలోని మంతటి చెరువు కింద గత సీజన్‌లో 200 ఎకరాల సాగు ఉండగా ఈసారి కేవలం 20ఎకరాల వరకే సాగు జరిగింది. ఇక కల్వకుర్తి పరిధిలోని గుడిపల్లి రిజర్వాయర్‌లో నీటి మట్టాలు సైతం అడుగంటాయి. రాళ్లు, మట్టి తేలింది. గతేడాది ఈ సమయంలో నిండు కుండ లా ఉన్న రిజర్వాయర్‌ ఇప్పుడు బోసిపోయింది.

సమీపంలోని రైతులు వరి పొలాలకు నీళ్లు లేక రిజర్వాయర్‌లో మోటర్లను ఏర్పాటు చేసుకొని కాల్వలకు పారించి, అక్కడి నుంచి మోటర్లతో నీళ్లను తో డుకొంటున్న దుర్భర పరిస్థితులు నెలకొన్నాయి. ఇలా రిజర్వాయర్లు, చెరువుల్లో నీళ్లు లేక రైతులు ఈ సీజన్‌లో పంటల సాగును భారంగా చేపడుతున్నా రు. జిల్లాలో వరిపంట 1,63,331 ఎకరాల్లో సాగు చేస్తారని భావిస్తుండగా ఇప్పటి వరకు అధికారుల అంచనా మేరకు 85,367ఎకరాల్లో మాత్రమే సా గు జరిగింది. బోరు బావులపై ఆధారపడిన రైతులే పంటలకు విడుతల వారీగా తడి పెట్టుకొంటూ కా పాడుకుంటున్నారు. పంట చేతికి వచ్చే వరకు ప్ర స్తుతం కాపాడుకుంటూ వస్తున్న పరిస్థితులు చేయి దాటుతాయేమోననే భయం రైతన్నల్లో కనిపిస్తోం ది. జిల్లాలో ఒక్క వేరుశనగ మినహాయిస్తే పత్తి, జొ న్న, మొక్కజొన్న, పొద్దుతిరుగుడు, కందులు అంచనాలకంటే తక్కువగా సాగు చేపట్టడం ప్రస్తుత వ్యవసాయ స్థితిని తెలియజేస్తున్నది. మొత్తం మీద గత పదేండ్లలో ఎన్నడూ లేనంతగా పంటల సాగు తగ్గిపోవడంతో రైతన్నలు ఆందోళన చెందుతున్నారు.

నీళ్లు లేక తగ్గిన సాగు..

జిల్లాలో యాసంగి లో పంటల సాగు త గ్గింది. గత 2022లో 3.12లక్షల ఎకరాల్లో సాగు జరిగితే ఈసారి ఇప్పటి వరకు 2.20లక్షల ఎకరాల సాగు చేశారు. కల్వకుర్తి ప్రాజెక్టులో నీళ్లు లేకపోవడంతో చెరువులు, కుంటల కింద ఆయక్టటుపై కూడా ప్రభావం పడింది. బోర్లున్న రైతులు పంటలకు తగిన మోతాదులో తడి ఇస్తూ రక్షించుకుంటున్నారు.

– వెంకటేశ్వర్లు, డీఏవో, నాగర్‌కర్నూల్‌ జిల్లా

పెట్టుబడి కూడా వస్తుందో.. లేదో..

ఇరిగేషన్‌ అధికారులు సా గునీరందక క్రాప్‌ హాలిడే ప్రకటించడంతో బోర్‌ కింద కొంత మేరకు పంట సాగు చేశాను. బోరు నుంచి సరిపడినంత నీరు రావడంలేదు. పంట ఎండుతున్నది. పెట్టుబడి కూడా వస్తుందో లేదో అనే పరిస్థితి నెలకొన్నది.

– సిద్ధయ్యగౌడ్‌, రైతు, మాన్‌దొడ్డి గ్రామం, రాజోళి మండలం, జోగుళాంబ గద్వాల జిల్లా

నీటి భయంతో సాగు చేయలే..

సింగవట్నం శ్రీవారి స ముద్రం రిజర్వాయర్‌లో ప్ర స్తుతం ఉన్న నీటిని రానున్న వేసవిలో పశువులకు తాగునీటి అవసరాల కోసం నిల్వచేశారు. తాము ఒక వేళ ఆ యకట్టు కింద వరి సాగు చేస్తే నీటి సమస్య తలెత్తుతుందని భావించి రైతులందరం క్రాప్‌ హాలిడేను ప్రకటించుకున్నాం. ఆయకట్టు కింద నాకు అరెకరం ఉన్నది. పండించిన ధాన్యానికి గిట్టుబాటు ధర లేక సాగు పెట్టుబడులు మీద పడి అప్పులపాలుకావొద్దని భావించి యాసంగిలో సాగు చేయలేదు.

– నర్సింహ, రైతు, ఎన్మన్‌బెట్ల గ్రామం, కొల్లాపూర్‌ మండలం, నాగర్‌కర్నూల్‌ జిల్లా

పాత రోజులు గుర్తుకొస్తున్నాయి..

ఆరేండ్లలో కరువు అనేదే లేదు. నాకున్న పది ఎకరాల్లో యాసంగి, వానకాలం పంట లు సాగుచేసి మంచిగా బతికేవాళ్లం. వర్షాలు సరిగా లేనందున యాసంగిలో నా లుగున్నర ఎకరాలు మాత్ర మే వరి సాగుచేస్తున్నాను. ఉ న్న రెండు బోర్లల్లో నీళ్లు తగ్గిపోవడంతో రెండున్నర ఎకరాలు వదిలేసి.. రెండెకరాలు మాత్రమే నీళ్లు పారిస్తున్నా. పంట పూర్తి అయ్యేదాకా రెండెకరాలకు సరిపడా బోరులో నీళ్లు వస్తాయో.. రావో అని అనుమానంగా ఉన్నది. మా గ్రామంలో ఇప్పటికే చాలాబోర్లలో నీళ్లు తగ్గిపోయాయి. కొత్తవి వేస్తే తక్కువ నీళ్లు వచ్చాయి. కొన్ని ఫెయిల్‌ అయ్యాయి. నేను కూడా బోరు వేద్దామంటే నీళ్లు పడతాయో లేదోనని భయంగా ఉన్నది. వర్షాలు సమృద్ధిగా కురవక, ప్రాజెక్టులకు నీళ్లు రాకపోవడంతో మళ్లీ పాత రోజులు గుర్తుకు వస్తున్నాయి.

– కే రవీందర్‌, రైతు, దొడగుంటపల్లి గ్రామం, పెద్దమందడి మండలం, వనపర్తి జిల్లా

Source link

Telanganapress
  • Website

Related Posts

రైతు ఆదాయం రెట్టింపునకు ప్రత్యేక ప్రణాళిక-Namasthe Telangana

April 16, 2024

‘లోక్‌సభ’కు బీఆర్‌ఎస్‌ సన్నద్ధం-Namasthe Telangana

April 16, 2024

Health Insurance- IRDAI | హెల్త్ ఇన్సూరెన్సీ ‘కవరేజీ’పై ఐఆర్డీఏఐ గుడ్ న్యూస్.. అదేమిటంటే..?!-Namasthe Telangana

April 16, 2024
Leave A Reply Cancel Reply

Categories
  • 1
  • AI News
  • News
  • Telugu today
  • Uncategorized
  • తాజా వార్తలు
  • వార్తలు
కాపీరైట్ © 2024 Telanganapress.com సర్వ హక్కులు ప్రత్యేకించబడినవి.
  • Privacy Policy
  • Disclaimer
  • Terms & Conditions
  • About us
  • Contact us

Type above and press Enter to search. Press Esc to cancel.