మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ సతీమణి ఉపాసన గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. అపోలో ఆసుపత్రి బాధ్యతలు ఓ వైపు…మెగా కోడలిగా కుటుంబ బాధ్యతలు చూసుకుంటూ లైఫ్ ను బ్యాలెన్స్ చేస్తోంది. తమ కుటుంబ వారసత్వాన్ని నిలబెడుతూ వైద్య రంగంలో ముందుకు దూసుకెళ్తోంది. అంతేకాదు సేవాకార్యక్రమాలను నిర్వహించడంలోనూ ముందుంటుంది. తాజాగా ఉపాసన మరోసారి అభిమానులకు శుభవార్త చెప్పింది.
రామ్ చరణ్ ఉపాసన పెళ్లి చేసుకున్న దాదాపు పదేళ్ల తర్వాత క్లీంకారకు జన్మనిచ్చారు. పిల్లల విషయంలో ఈ జంటకు ఎన్ని ప్రశ్నలు ఎదురైనా ఎంతో సహనంతో ఉన్నారు. గతేడాది ఆడబిడ్డకు జన్మనిచ్చారు. పాపపేరు క్లింకార అని పెట్టారు. మెగా ఫ్యాన్స్ కూడా పండగ చేసుకున్నారు. అయితే తాజాగా మెగా అభిమానులకు ఉపాసన మరో పండగలాంటి వార్త చెప్పింది. తాజాగా ఓ కార్యక్రమానికి హాజరైన ఉపాసన రెండో బిడ్డకు జన్మనిచ్చే ప్లాన్ చేస్తున్నట్లు చెప్పింది. ఈ కార్యక్రమంలో మహిళల ఆరోగ్యం గురించి చాలా విషయాలు చెప్పుకొచ్చింది. మహిళలు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ద పెట్టాలని చెప్పింది. ఫైనల్ గా తన రెండో గర్భం గురించి ప్రశ్న ఎదురవ్వగా మై హెల్ మై ఛాయిస్ అని చెప్పింది. ఉపాసన చేసిన ఈ కామెంట్స్ నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. ఈ వీడియోను ఉపాసన ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసింది.
View this post on Instagram
ఇది కూడా చదవండి: బంగారం గనిలో ప్రమాదం..14 మంది దుర్మరణం..!!
The post రెండోసారి తల్లి కాబోతున్న ఉపాసన? ఆనందంతో ఫ్యాన్స్..!! appeared first on tnewstelugu.com.