రేపు(ఆదివారం) నాగర్ కర్నూల్ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీమంత్రి కేటీఆర్ పర్యటించనున్నారు. అచ్చంపేట,నాగర్ కర్నూల్ నియోజకవర్గాలలో పార్లమెంట్ ఎన్నికల ముఖ్య కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో కేటీఆర్ పాల్గొని.. నాయకులకు కార్యకర్తలకు దిశా నిర్దేశం చేయనున్నట్లు నాగర్ కర్నూల్ బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు గువ్వల బాలరాజు తెలిపారు.
ఉదయం మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు అధ్యక్షతన అచ్చంపేటలోని డీకే ప్యాలెస్ లో.. మధ్యాహ్నం మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి అధ్యక్షతన నాగర్ కర్నూల్ బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో సమావేశాలు నిర్వహించనున్నారు. ఈ సమావేశాలకు బీఆర్ఎస్ శ్రేణులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు.
ఇది కూడా చదవండి: నేటితో ముగియనున్న మేడారం జాతర..వన ప్రవేశం చేయనున్న సమ్మక్క,సారలమ్మ
The post రేపు నాగర్ కర్నూల్ జిల్లాలో కేటీఆర్ పర్యటన appeared first on tnewstelugu.com.
