దేశ రాజధాని ఢిల్లీలో రైతుల ఆందోళన కొనసాగుతోంది. తమ డిమాండ్లు నెరవేరుస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చేవరకు ఆందోళన విరమించేది లేదని రైతులు తెగేసి చెబుతున్నారు. ఈ మేరకు ఢిల్లీ, పంజాబ్-హర్యానా సరిహద్దుల్లోనే వారు మకాం వేశారు. కావాల్సిన సరుకు సరంజామా అంతా వెంట తెచ్చుకుని బార్డర్లో తిష్టవేశారు. అక్కడే వండుకుతిని గుడారాల్లో తలదాచుకుంటున్నారు.
తాము పండించిన పంటలకు కనీస మద్దతు ధర కల్పించాలని, గత ఆందోళనల సందర్భంగా తమపై నమోదు చేసిన కేసులను ఎత్తివేయాలని రైతులు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. రైతుల డిమాండ్లపై చర్చకు సిద్ధమంటూనే ప్రభుత్వం ఆలస్యం చేస్తూ వస్తున్నది. గతంలోలా రైతులు రాజధానిలోకి చొచ్చుకురాకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేసింది. పంజాబ్-హర్యానా మధ్య ఉన్న శంభు సరిహద్దులో రైతులు వాహనాలపైనే వంట చేసుకుంటున్నారు.
ఇది కూడా చదవండి: రేవంత్ పాలన ప్రజా పాలన కాదు.. తెలంగాణ మీద ప్రతీకార పాలన
