సిద్ధిపేట జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. మూడేళ్ల చిన్నారిని మేనమామ హత్య చేశాడు. అయితే అతనికి మతిస్థితిమితం లేదని తెలిసింది. ఈ ఘటన నంగునూర్ మండలం బద్ధిపడగ గ్రామంలో జరిగింది. పూర్తి వివరాల ప్రకారం శిరీష మూడేళ్ల చిన్నారిని తల్లి సంతోషితో కలిసి గ్రామంలోని పొలానికి తీసుకెళ్లింది. తల్లి పొలం పనుల్లో నిమగ్నమైంది. సమీపంలో ఆడుకుంటున్న శిరీషను ఆమె మేనమామ శ్రీనివాస్ బురదలో తొక్కి చంపాడు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అయితే శ్రీనివాస్ మానసిక స్థితి సరిగ్గా లేదని కుటుంబ సభ్యులు తెలిపారు.
ఇది కూడా చదవండి; సమ్మక్క సారలమ్మ వనప్రవేశంతో ముగిసిన మేడారం మహాజాతర..!
The post సిద్ధిపేటలో దారుణం..మూడేళ్ల చిన్నారిని చంపిన మేనమామ.! appeared first on tnewstelugu.com.
