Sajjala Ramakrishna Reddy | పవన్ కల్యాణ్ ను చూస్తే జాలి కలుగుతున్నదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు.
Sajjala Ramakrishna Reddy | జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ కల్యాణ్ ను చూస్తే జాలి కలుగుతున్నదని అన్నారు. జనసేన అభ్యర్థులను కూడా చంద్రబాబే డిసైడ్ చేస్తారా? అని ప్రశ్నించారు. చంద్రబాబు పడేసే సీట్లు తీసుకునే స్థాయికి పవన్ కల్యాణ్ దిగజారి పోయారని సజ్జల వ్యాఖ్యానించారు.
శనివారం టీడీపీ-జనసేన కూటమి అభ్యర్థులతో కూడిన తొలి జాబితాను చంద్రబాబు, పవన్ కల్యాణ్ విడుదల చేశారు. ఈ జాబితాపై సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ‘పవన్ కల్యాణ్‌కు రాజకీయ పార్టీ నడిపే లక్షణాలు లేవు. పవన్ కల్యాణ్ పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది. జనసేన అభ్యర్థులనూ చంద్రబాబు డిసైడ్ చేస్తారా..? సొంతంగా బలం లేదని పవన్ కల్యాణ్ ఒప్పుకుంటున్నారు. పవన్ కల్యాణ్ కంటే ఆయన అభిమానులను చూస్తే జాలేస్తున్నది. చంద్రబాబుకు పవన్ కల్యాణ్ ఎందుకు మద్దతు ఇస్తున్నాడో చెప్పలేకపోతున్నాడు. తానూ పోటీ చేసే స్థానం మీదా పవన్ కల్యాణ్‌కు క్లారిటీ లేదు’ అని సజ్జల పేర్కొన్నారు.
