Close Menu
  • Telugu today
  • తాజా వార్తలు
  • వార్తలు
Facebook X (Twitter) Instagram
Trending
  • Gamble Caribbean Hold’em Casino poker on the internet pokie
  • Better No deposit Local casino Bonuses 2024 » 100 percent free Bucks & Free Spins
  • The Increase of Student-Driven Encyclopedias: Changing Understanding Landscapes
  • Finest Cellular Casinos: Greatest Us Cellular Gambling enterprise Applications and Advertisements within the 2025
  • Best Mobile Web based poker Software the real deal Cash on apple’s ios & Android os within the 2025
  • Greatest ten Online gambling Programs for real Cash in 2025
  • Casino utan svensk licens 2025 – Topp 10 casino utan Spelpaus
  • Bet with Sahabet 💰 Bonus up to 10000 Rupees 💰 Play Online Casino Games
Telangana Press
  • Telugu today
  • తాజా వార్తలు
  • వార్తలు
Telangana Press
వార్తలు

Dhruv Jurel | మీడియా హైప్‌ లేదు.. డ్రామా లేదు.. కానీ అదే నీకు బలం : జురెల్‌పై దిగ్గజాల ప్రశంసలు-Namasthe Telangana

TelanganapressBy TelanganapressFebruary 25, 2024No Comments

Dhruv Jurel | రోహిత్‌, గిల్‌, జడేజా వంటి సీనియర్లు తక్కువ స్కోరుకే వెనుదిరిగిన చోట, బంతి స్పిన్‌కు విపరీతంగా అనుకూలిస్తున్న పిచ్‌ మీద జురెల్‌.. 149 బంతుల్లో 90 పరుగులతో రాణించాడు.

February 25, 2024 / 03:47 PM IST
Dhruv Jurel | మీడియా హైప్‌ లేదు.. డ్రామా లేదు.. కానీ అదే నీకు బలం : జురెల్‌పై దిగ్గజాల ప్రశంసలు

Dhruv Jurel | భారత్‌ – ఇంగ్లండ్‌ మధ్య రాంచీ వేదికగా జరుగుతున్న నాలుగో టెస్టులో ఇంగ్లీష్ బౌలర్ల స్పిన్‌ ఉచ్చులో పడి చిక్కుకున్న రోహిత్‌ సేనను వికెట్‌ కీపర్‌ ధ్రువ్‌ జురెల్‌ ఆదుకున్నాడు. రోహిత్‌, గిల్‌, జడేజా వంటి సీనియర్లు తక్కువ స్కోరుకే వెనుదిరిగిన చోట, బంతి స్పిన్‌కు విపరీతంగా అనుకూలిస్తున్న పిచ్‌ మీద జురెల్‌.. 149 బంతుల్లో 90 పరుగులతో రాణించాడు. రాజ్‌కోట్‌ టెస్టులో అరంగేట్రం చేసిన ఈ ఉత్తరప్రదేశ్‌ కుర్రాడు.. సెంచరీకి పది పరుగుల దూరంలో ఔట్‌ అయినా భారత్‌ను ఆదుకున్నాడు. రాంచీలో జురెల్ ఇన్నింగ్స్‌పై దిగ్గజ క్రికెటర్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. సునీల్ గవాస్కర్‌, వీరేంద్ర సెహ్వాగ్‌, వసీం జాఫర్‌లు జురెల్‌ను పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.

జురెల్ ఇన్నింగ్స్‌పై వీరేంద్ర సెహ్వాగ్‌ ట్విటర్‌ (ఎక్స్‌) వేదికగా స్పందిస్తూ… ‘మీడియా హైప్‌ లేదు. ఏ డ్రామా లేదు. కానీ నీ దగ్గర అద్భుతమైన నైపుణ్యం ఉంది. అత్యంత కఠిన పరిస్థితులల్లో నీవు చూపిన తెగువ గొప్పది. చాలా బాగా ఆడావ్‌ జురెల్‌.. బెస్ట్‌ విషెస్‌’ అని రాసుకొచ్చాడు.

 

No media hype, no drama, just some outstanding skills and quietly showed great temparement in a very difficult situation.
Very Well done Dhruv Jurel. Best wishes. pic.twitter.com/XOtUYd8Je3

— Virender Sehwag (@virendersehwag) February 25, 2024

భారత దిగ్గజం సునీల్‌ గవాస్కర్‌ మాట్లాడుతూ.. ‘ఇంత ప్రశాంతంగా ఆడుతున్న జురెల్‌ను చూస్తుంటే నాకు ఎంఎస్‌ ధోని గుర్తుకువస్తున్నాడు. అతడు కచ్చితంగా భారత్‌కు భావితార అవుతాడు..’అని అన్నాడు.

 

Whole of India to Dhruv Jurel today 🫡 What an impressive performance both behind and in front of the wicket by Dhruv. The importance of this knock and the partnership with Kuldeep cannot over overstated. Top notch game awareness 👏🏽 #INDvENG pic.twitter.com/vyujRgRnkQ

— Wasim Jaffer (@WasimJaffer14) February 25, 2024

మాజీ ఓపెనర్‌ వసీం జాఫర్‌ ట్విటర్‌లో స్పందిస్తూ.. ‘వికెట్ల వెనుకాల, ముందు అద్భుతమైన ప్రదర్శన ఇచ్చావు. కుల్‌దీప్‌తో నీ భాగస్వామ్యం గురించి ఎంత చెప్పినా తక్కువే..’ అని ట్వీట్‌ చేశాడు. రాంచీ టెస్టు విషయానికొస్తే.. ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 353 పరుగులకు ఆలౌట్‌ అవగా భారత్‌.. 307 పరుగులకే కుప్పకూలింది. తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్‌కు 46 పరుగుల ఆధిక్యం దక్కింది. రెండో ఇన్నింగ్స్‌లో ఆ జట్టు భారత స్పిన్నర్ల మాయలో చిక్కుకుని విలవిల్లాడుతోంది. మూడో రోజు ఆటలో భాగంగా ఆ జట్టు 51 ఓవర్లు ముగిసేసరికి 8 వికెట్లు కోల్పోయి 143 పరుగులు చేసింది.



Source link

Telanganapress
  • Website

Related Posts

రైతు ఆదాయం రెట్టింపునకు ప్రత్యేక ప్రణాళిక-Namasthe Telangana

April 16, 2024

‘లోక్‌సభ’కు బీఆర్‌ఎస్‌ సన్నద్ధం-Namasthe Telangana

April 16, 2024

Health Insurance- IRDAI | హెల్త్ ఇన్సూరెన్సీ ‘కవరేజీ’పై ఐఆర్డీఏఐ గుడ్ న్యూస్.. అదేమిటంటే..?!-Namasthe Telangana

April 16, 2024
Leave A Reply Cancel Reply

Categories
  • 1
  • AI News
  • News
  • Telugu today
  • Uncategorized
  • తాజా వార్తలు
  • వార్తలు
కాపీరైట్ © 2024 Telanganapress.com సర్వ హక్కులు ప్రత్యేకించబడినవి.
  • Privacy Policy
  • Disclaimer
  • Terms & Conditions
  • About us
  • Contact us

Type above and press Enter to search. Press Esc to cancel.