కాంగ్రెస్ నాయకుల మెప్పు కోసం పోలీసులు దౌర్జన్యానికి పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి. ఇవాళ(ఆదివారం) హనుమకొండ జిల్లా బాలసముద్రంలోని బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో మీడియా సమావేశం మాట్లాడిన ఆయన..సామాన్యులపై థర్డ్ డిగ్రీ ప్రయోగించడం సిగ్గు చేటు. ఆత్మకూర్ ఎస్సైని వెంటనే సస్పెండ్ చేయాలి. సామాన్యులకు న్యాయం చేయాలనీ సీపీని కోరారు. 30 ఏండ్ల నాటి కిరాతక చర్యలు కాంగ్రెస్ ప్రభుత్వ రెండు నెలలోపే వచ్చాయి.
ఆగ్రoపహాడ్ జాతరకు వచ్చిన మాజీ ఏమ్మెల్యే చల్లా ధర్మా రెడ్డిని చూసిన కార్యకర్తలు, భక్తులు జై చల్లా,జై తెలంగాణ నినాదాలు చేశారు.కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు ఎలాంటి గొడవ జరగలేదు. బలవంతంగా కానిస్టేబుల్ తో 12మంది పై నాన్ బెయిలబుల్ కేసులు పెట్టించారు.నాన్ బెయిలబుల్ కేసులు పెట్టిన కూడా థర్డ్ డిగ్రీ ప్రయోగించారు పోలీసులు. అప్పుడు ఇందిరమ్మ రాజ్యంలో ఎంకౌంటర్ లు జరిగేవి. ఇప్పుడు ఇందిరమ్మ రాజ్యం అని ప్రతిపక్షాల పైన దాడులు జరుగుతున్నాయి. 12మంది బీఆర్ఎస్ కార్యకర్తలను చిత్ర హింసలకు గురి చేసి థర్డ్ డిగ్రీ ప్రయోగించిన ఆత్మకూరు ఎస్ఐ ని సస్పెండ్ చేయాలి.24 గంటలలో పోలీసుల నుంచి సరైన స్పందన లేకపోతే 27వ తేదీన ఛలో ఆత్మకూరు ఉంటుందని హెచ్చరించారు ఎమ్మెల్యే కడియం శ్రీహరి.
ఇది కూడా చదవండి: జర్నలిస్ట్ శంకర్ పైన జరిగిన హత్యాయత్నం వెనకనున్నది సీఎం రేవంత్ రెడ్డినే
