తెలంగాణలో పలువురు ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం హైదరాబాద్ సీసీఎస్ జాయింట్ కమిషనర్‌గా ఉన్న ఏవీ రంగనాథ్ ను వరంగల్ మల్టీజోన్-1 ఐజీగా నియమించారు.గతంలో వరంగల్ పోలీస్ కమిషనర్ గా ఏవీ రంగనాథ్ సమర్ధవంతంగా విధులు నిర్వర్తించారు. వరంగల్ ప్రజల మనస్సులను గెల్చుకొన్న ఏవీ రంగనాథ్ ను ఎన్నికల సంఘం సూచనల మేరకు అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంపెర్డ్ ఐపీఎస్ పేరుతో బదిలీ చేశారు. ప్రస్తుతం సుధీర్ బాబు మల్టీ జోన్ వన్ ఇన్ చార్జి ఐజీపీగా కొనసాగుతున్నారు. ఇప్పుడు తాజాగా, మల్టీ జోన్ వన్‌కు పూర్తిస్థాయి ఐజీపీగా ఏవీ రంగనాథ్‌ను ప్రభుత్వం నియమించింది.
అంతేకాదు..ట్రాఫిక్ అదనపు సీపీగా ఉన్న విశ్వప్రసాద్‌ను ఆర్గనైజేషన్ ఐజీగా, మధ్య మండల డీసీపీగా ఉన్న శరత్ చంద్ర పవార్‌ను టీఎస్ న్యాబ్ ఎస్పీగా నియమిస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది.
ఇది కూడా చదవండి: రేషన్ కార్డుదారులకు అలర్ట్: మరో 3రోజుల్లో ముగియనున్న ఈ-కేవైసీ గడువు
