రాష్ట్రంలో రేషన్ కార్డుల ఈ-కేవైసీ ప్రక్రియ గడువు మరో మూడు రోజుల్లో ముగియనుంది. అసలైన లబ్దిదారులకే రేషన్, బోగస్ కార్డులు తొలగింపునకు కేంద్రం ప్రభుత్వం ఆదేశాలతో తెలంగాణ ప్రభుత్వం ఈ-కేవైసీ ప్రక్రియ చేపట్టింది. ముందుగా జనవరి 31 వరకు గడువు ఇచ్చింది. అయితే టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల అందరూ ఈ-కేవైసీ పూర్తి చేసుకోలేదు. దీంతో ఆగడువును ఫిబ్రవరి నెలాఖరు వరకూ పొడిగించారు. మరో మూడు రోజుల్లో ఈ గడువు ముగియనుంది. దీంతో రేషన్ కార్డు హోల్డర్స్ ఇంకా ఎవరైనా ఈ-కేవైసీ పూర్తి చేయకపోతే త్వరగా చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. పేదరిక నిర్మూలన లక్ష్యంగా దారిద్ర్యరేఖకు దిగువన ఉన్నవారికి కేంద్రం ప్రభుత్వం రేషన్ కార్డులు జారీ చేస్తుంది. రేషన్ కార్డు ఆధారంగా పలు ప్రభుత్వ పథకాలకు లబ్దిదారులను ఎంపిక చేస్తారు.
తెలంగాణలో ఇప్పటి వరకూ 75 శాతం మంది రేషన్ కార్డు ఈ-కేవైసీ పూర్తిచేసున్నారు. ఇంకా 25 శాతం ఈ-కేవైసీ చేయించుకోవాల్సి ఉంది. పలుకారణాలతో ఈ-కేవైసీ పూర్తి చేయించుకోనివాళ్ల కోసం కేంద్ర ప్రభుత్వం గడువును పొడిగించింది. దీంతో తెలంగాణ ప్రభుత్వం కూడా ఈ-కేవైసీ గడువును పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. లబ్దిదారులు రేషన్ షాపులో వేలిముద్రలు వేసి ఈ-కేవైసీ పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది. ఫిబ్రవరి నెలాఖరులోపు 100 శాతం ఈ-కేవైసీ పూర్తి చేసుకునేలా చూడాలని పౌరసరఫరాల శాఖ అధికారులకు సూచించారు. లబ్దిదారులు రేషన్ షాపులకు వెళ్లి ఈ-పోస్ యంత్రం ద్వారా బయోమెట్రిక్ నమోదు చేయాలి. మరణించిన వారు, పెళ్లి చేసుకుని మరో ప్రాంతానికి వెళ్లినవాళ్లు ప్రభుత్వ ఉద్యోగాలు పొందిన వారి పేర్లను రేషన్ కార్డుల్లోంచి తొలగించని కారణంగా బియ్యం కోటా మిగిలిపోతున్నాయి. దీంతో ప్రభుత్వం ఈ-కేవైసీ ప్రక్రియను చేపట్టింది.
ఇది కూడా చదవండి: హైదరాబాద్ లో డ్రగ్స్ కలకలం.. పోలీసుల అదుపులో బీజేపీ నేత కుమారుడు
