పర్యాటకుల ఆహ్లాదం కోసం విశాఖ ఆర్కే బీచ్‌లో ప్రారంభించిన ఫ్లోటింగ్ బ్రిడ్జ్గంటల వ్యవధిలోనే కొట్టుకుపోయింది. సుమారు రూ. కోటి 60 లక్షలతో ఏర్పాటు చేసిన ఫ్లోటింగ్ బ్రిడ్జ్‌ను నిన్న(ఆదివారం) విశాఖ బీచ్‌లో వైసీపీ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి,ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ తదితరులు లాంఛనంగా ప్రారంభించారు. ప్రారంభించిన ఒక్కరోజులోనే బ్రిడ్జ్ అంచున ఉన్న భాగం వంద మీటర్ల దూరం జరుగడంతో నిర్వాహకులు అప్రమత్తమయ్యారు.పర్యాటకులు ప్రస్తుతం ఫ్లోటింగ్ బ్రిడ్జి వైపు వెళ్లకుండా భద్రత ఏర్పాటు చేశారు. బ్రిడ్జ్ అంచున ఉన్న భాగం దూరం జరిగిన సమయంలో పర్యాటకులు లేక పోవడంతో ప్రమాదం తప్పినట్లు తెలుస్తోంది.
ఇది కూడా చదవండి: జ్ఞానవాపి సెల్లార్లో పూజలకు అనుమతించిన అలహాబాద్ హైకోర్టు
