Road Accident | సంగారెడ్డి జిల్లాలో సోమవారం అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. ఆందోల్ మండలం డాకూర్ శివారులో ప్రమాదం చోటు చేసుకున్నది.
Road Accident | సంగారెడ్డి జిల్లాలో సోమవారం అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. ఆందోల్ మండలం డాకూర్ శివారులో ప్రమాదం చోటు చేసుకున్నది. రోడ్డుపై నిల్చున్న ముగ్గురు వ్యక్తులను గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. తీవ్ర గాయాలకు గురైన ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదంలో మరికొందరు గాయపడ్డారు. రోడ్డు పక్కనే కారు ఆపి నిల్చున్న సమయంలో అటువైపుగా వచ్చిన గుర్తు తెలియని వాహనం ఢీకొట్టి వెళ్లిపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడ్డ వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతుల వివరాలు ఆరా తీస్తున్నారు. ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
